మన భారత జెండాతో పాకిస్తాన్ క్రికెటర్ కూతురు.. నిజమన్న అఫ్రిది.. అంతా షాక్

Update: 2022-09-13 07:37 GMT
ఆసియా కప్ ఫైనల్ లో గెలవాల్సిన పాకిస్తాన్ ఓడిపోయింది.  శ్రీలంక చేతిలో చిత్తు అయిపోయింది. దీంతో పాకిస్తాన్ అభిమానుల ఆగ్రహానికి అంతే లేకుండాపోతోంది. స్వయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా కూడా ఫైర్ అయిన పరిస్థితి.  ఆసియాకప్ లో సూపర్ 4 దశలో భారత్ పై గెలవడమే పాకిస్తాన్ కు కాస్త ఊరట అని చెప్పొచ్చు.

పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది చిన్న కూతురు చేసిన పని వైరల్ అయ్యింది. భారత జెండా ఊపుతూ కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తానీలు ఇది చూసి భగ్గుమంటున్నారు. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో అఫ్రిదిని ప్రశ్నించారు. ఆ సమాధానం విని అంతా షాక్ అయ్యారు. ఈ విషయంపై పెద్దగా నవ్వుతూ అఫ్రిది సమాధానం చెప్పడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

'అవును నా కూతురు భారత జెండా పట్టుకుందని.. ఆ వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయని.. పాపతో ఉన్న నా భార్య కూడా ఈ విషయాన్ని చెప్పింది.. ఆ రోజు స్టేడియంలో 90శాతం మంది భారత అభిమానులు.. కేవలం 10 శాతం మంది మాత్రమే పాకిస్తాన్ ఫ్యాన్స్ ఉన్నారు. స్టేడియం వద్ద పాక్ జాతీయ జెండాలు దొరక్కపోవడంతో మా పాప భారత జెండాను పట్టుకుంది' అంటూ ఇదేదో కావాలని చేసిన పని కాదని.. చిన్న పిల్ల తనకు జెండా కావాలని మారాం చేయడంతో పట్టుకుందని అఫ్రిది కవర్ చేశాడు.

ఇది చిన్న పిల్ల తన కూతురు మచ్చట తీర్చాలని చేసిందే తప్ప.. కావాలని భారత జెండా పట్టుకోవాలని ఎవరికీ ఉండదని అఫ్రిది వివరణ ఇచ్చారు.

ఇక పాక్ పై ఫైనల్ లో గెలిచిన శ్రీలంక జెండాను కూడా గంభీర్ పట్టుకొని ఊపాడు. అలా చేసినంత మాత్రాన అతడు శ్రీలంకన్ అయిపోయాడా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా రచ్చ చేయవద్దని కొందరు హితవు పలుకుతున్నారు.

ఆసియాకప్ తొలి రౌండ్ లో పాక్ పై ఇండియా గెలిచింది. ఆ తర్వా త సూపర్ 4లో మాత్రం ఇండియా ఓడిపోయింది. సూపర్ 4లో శ్రీలంక, పాకిస్తాన్ లు ఫైనల్  చేరగా.. భారత్, అప్ఘనిస్తాన్ ఇంటిదారి పట్టాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News