ప‌ళ‌నికి ఊహించ‌ని షాకిచ్చిన సొంత టీం

Update: 2019-03-21 09:59 GMT
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామికి ఎప్పుడో ఏదో ఒక త‌ల‌నొప్పి వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా ఆయ‌న్ను సొంతోళ్లే అడ్డంగా బుక్ అయ్యేలా చేశారు. త‌న‌కేమాత్రం ప్ర‌మేయం లేకున్నా.. సొంత టీం అత్యుత్సాహం ఆయ‌న్ను చిక్కుల్లో ప‌డేలా చేయ‌ట‌మే కాదు.. ఈసీకి ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చే వ‌ర‌కూ వెళ్లింది. వివ‌ర‌ణ ఇచ్చిన త‌ర్వాత అయినా ఎన్నిక‌ల సంఘం స‌మాధాన‌ప‌డుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఇప్పుడున్న డిజిట‌ల్ జ‌మానాలో ప్ర‌తి పార్టీ.. ప్ర‌తి అధినేత సొంత సోష‌ల్ మీడియా బృందాన్ని ఏర్పాటు చేసుకోవ‌టం.. వారి ద్వారా ప్ర‌చారాన్ని భారీగా చేసుకోవ‌టం తెలిసిందే. ఇదే తీరులో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి సైతం ఒక సోష‌ల్ మీడియా టీంను ఏర్పాటు చేసుకున్నారు.
తాజాగా ఆ బృందం ఒక లేఖ‌ను విడుద‌ల చేసింది. అందులో వందేళ్లైనా అన్నాడీఎంకే అధికారంలో ఉండాల‌న్న మ‌న అమ్మ.. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత క‌ల‌ల్ని సాకారం చేసేలా ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలి. అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌ల‌కు ఇదే నా పిలుపు అంటూ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు.
ఏందండి.. ఇందులో ఒక్క త‌ప్పు అయినా ఉందా?  ఈ మాత్రం దానికే ప‌ళ‌నిస్వామికి ఇబ్బందులు ఎందుకు వ‌స్తాయి? అన్న సందేహం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఈ ట్వీట్ ను ప‌ళ‌నిస్వామి వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేయ‌కుండా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

దీంతో.. ఈ ట్వీట్ సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. పెను దుమారానికి కార‌ణ‌మైంది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ కంప్లైంట్లు ఇచ్చారు ప‌లువురు. దీంతో స్పందించిన ఎన్నిక‌ల సంఘం కోడ్ ఆఫ్ కండ‌క్ట్ కింద సోష‌ల్ మీడియా కూడా వ‌స్తుంద‌ని పేర్కొంటూ.. ఎందుకిలా చేశార‌న్న దానిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు. జ‌రిగిన త‌ప్పును ఎన్నిక‌ల సంఘం ఎలా తీసుకుంటుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. సొంత టీం చేసిన రాంగ్ పోస్ట్ ఇప్పుడాయ‌న‌కు కొత్త త‌ల‌నొప్పిగా మారిన‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News