ప‌ళ‌నిస్వామి స‌హా మంత్రుల అరెస్టుకు స్కెచ్‌?

Update: 2017-04-30 08:26 GMT
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకోవ‌డం ఖాయ‌మ‌ని తేలుతోంది. రెండు ఆకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో చిన్న‌మ్మ శ‌శిక‌ళ అక్క కుమారుడు దిన‌క‌ర‌న్ ప్రమేయం రుజువు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో మూడు రోజుల పాటు దినకరన్‌ను చెన్నై తీసుకొచ్చి విచారించిన ఢిల్లీ పోలీసులు, కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మన్నార్ గుడి మాఫియాగా పేరున్న చిన్న‌మ్మ కుటుంబమే కాకుండా త‌మిళ‌నాడు  మంత్రుల ప్రమేయం ఉందని తేలిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో సీఎం పళనిస్వామికి కలవరం మొదలైంది.

ఆర్కేనగర్ ఉప ఎన్నిక‌లో డబ్బులు పంచిన కేసులో ఐటీకి కావాల్సినన్ని ఆధారాలు లభించిన ఎపిసోడ్‌లో దినకరన్ పై మాత్రమే ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ కేసు పెట్టింది. కానీ ఇప్పుడు ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో కూడా మంత్రుల పాత్ర బయటపడటంతో ఇక వారిని ఉపేక్షించకూడదని ఢిల్లీ డిసైడైనట్లు తెలుస్తోంది. సీఎం పళనిస్వామి సహా నలుగురు మంత్రులపై కేసులు పెట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే  అదే జరిగితే తమిళ క్యాబినెట్‌ లో కుదుపులు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసుల భయంతో పలువురు మంత్రులు జిల్లాల బాట పట్టగా తర్వాత ఎవర్ని అరెస్ట్ చేస్తారనేది ఉత్కంఠకు దారితీస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News