అమ్మ‌ ఛాన‌ల్.. పేప‌ర్ ఇప్పుడెవ‌రి సొంతం?

Update: 2017-08-29 17:05 GMT
తిరుగులేని రీతిలో వ‌రుస పెట్టి రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న పురుట్చిత‌లైవి జ‌య‌ల‌లిత‌కు ఎదురులేద‌నుకున్నారంతా.  రికార్డు స్థాయిలో కొన్ని ద‌శాబ్దాలుగా చెర‌గ‌ని రికార్డును బ్రేక్ చేస్తూ వ‌రుస‌గా రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమె.. అనూహ్యంగా అనారోగ్యంతో ఆసుప‌త్రి పాలు కావ‌టం తెలిసిందే.

అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డ‌తార‌న్న అంద‌రి అంచ‌నాల్ని తారుమారు చేస్తూ.. నెల‌ల త‌ర‌బ‌డి చెన్నై అపోలో చికిత్స పొందిన ఆమె.. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ కాకుండా అక్క‌డే తుదిశ్వాస విడ‌వ‌టం తెలిసిందే. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత అధికారిక అన్నాడీఎంలో చోటు చేసుకున్న సిత్రాల‌కు అంతూపొంతూ లేకుండా పోయింది.

అమ్మ త‌ర్వాత ఆమె స్థానాన్ని కైవ‌శం చేసుకోవ‌టంలో స‌క్సెస్ అయిన చిన్న‌మ్మ దూకుడుకు క‌ళ్లాలు వేస్తూ.. అమ్మ విశ్వాస‌పాత్రుడు ప‌న్నీరు సెల్వం తిరుగుబాటుబావుటా ఎగుర‌వేయ‌ట‌మే కాదు.. నిర‌స‌న గ‌ళం వినిపించారు. అయితే.. చిన్న‌మ్మ మంత్రాంగంతో ప‌న్నీర్ సెల్వం ప‌ప్పులు ఉడ‌క‌లేదు. అనూహ్యంగా అక్ర‌మాస్తుల కేసులో చిన్న‌మ్మ జైలుకు వెళితే.. ఆమె విధేయుడిగా ప‌ళ‌నిస్వామి తెర మీద‌కు వ‌చ్చి సీఎం కుర్చీలో కూర్చున్నారు.

ఇదిలా ఉంటే.. అనూహ్యంగా చిన్న‌మ్మ చుట్టం దిన‌క‌ర‌న్ ను తెర మీద‌కు  తీసుకొచ్చి ప‌ళ‌నిస్వామి కూర్చున్న కుర్చీని లాగేసే ప్ర‌య‌త్నం చేస్తున్న వైనాన్ని గుర్తించ‌టం.. అదే స‌మ‌యంలో పెద్ద ఎత్తున క‌దిపిన పావుల‌తో చిన్నమ్మ విధేయుడు ప‌ళ‌నిస్వామి ఇచ్చిన షాక్ అన్నాడీఎంలో ఉన్న రెండు గ్రూపులు కాస్తా మూడు గ్రూపులుగా మారేలా చేసింది. చివ‌ర‌కు ప‌లు అంత‌ర్గ‌త భేటీల అనంత‌రం ప‌న్నీర్‌.. ప‌ళ‌ని ఏకం కావ‌టం.. ఇద్ద‌రూ ఒక‌టై.. త‌మ ఉమ్మ‌డి ప్ర‌త్య‌ర్థిగా మారిన చిన్మ‌మ్మ .. ఆమె చ‌ట్టం దిన‌క‌ర‌న్ కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేశారు.

న‌మ్మి సీఎం కుర్చీలో కూర్చోబెడితే త‌న‌కే హ్యాండ్ ఇచ్చిన ప‌ళ‌నిస్వామికి.. త‌మ‌పై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసిన ప‌న్నీర్ సెల్వంకు షాకిచ్చేందుకు చిన్న‌మ్మ త‌హ‌త‌హ‌లాడుతోంది. చిన్న‌మ్మ‌ను.. ఆమె చుట్టం దిన‌క‌ర‌న్‌ కు అన్నాడీఎంకే ఆర్టీ మీద ప‌ట్టు లేకుండా చేసేందుకు వీలుగా ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేసిన ప‌ళ‌ని.. ప‌న్నీర్ ద్వ‌యం తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల స‌మావేశాన్ని ఏర్పాటు చేసి.. ముఖ్య‌మైన నాలుగు తీర్మానాల్ని ఆమోదించారు.

ఈ నాలుగు తీర్మానాల్లో ఒక‌టి ఇప్పుడు పెద్ద క‌ల‌క‌లాన్నే రేపుతోంది. ఇంత‌కీ అంత రచ్చ చేస్తున్న ఆ తీర్మానం ఏమిటంటే.. జ‌య టీవీని.. న‌మ‌దు ఎంజీఆర్ ప‌త్రిక‌ను స్వాధీనం చేసుకోవ‌టం. అమ్మ ప్రారంభించిన అన్ని ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాల‌న్న‌ది ప‌న్నీర్‌.. ప‌ళ‌నిల ల‌క్ష్యంగా మార‌టంతో చిన్న‌మ్మ వ‌ర్గం అలెర్ట్ అయ్యింది. దిన‌క‌ర‌న్ వ‌ర్గానికి మ‌ద్ద‌తుదారైన నాంజిల్ సంప‌త్  తాజా తీర్మానాల్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈ రెండు ఆస్తులు వ్య‌క్తిగ‌త‌మైన‌వి.. ఎవ‌రికి జోక్యం చేసుకోవ‌టానికి హ‌క్కు లేవ‌ని చెబుతున్నారు. సంప‌త్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత జ‌య‌టీవీ సీఈవో వివేక్ జ‌య‌రామ‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ.. తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టటాన్ని ఖండించారు. తాజా ప‌రిణామాల‌తో అమ్మ‌కు చెందిన టీవీ ఛాన‌ల్‌.. పేప‌ర్ ఎవ‌రి వ‌శం అవుతాయ‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. దీనిపై ఒక క్లారిటీ రావ‌టానికి కొంత కాలం ప‌డుతుంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News