సీఎం కుర్చీలో ఏ అమ్మ ఫోటో పెడతారు?

Update: 2017-02-17 04:50 GMT
విధేయ రాజకీయాలకు తమిళనాడు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. నమ్మి ముఖ్యమంత్రిగా చేస్తే.. ఎలాంటి విధేయతనుప్రదర్శించాలన్న విషయంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పటికే కొన్ని బెంచ్ మార్క్ లను పెట్టేయటం మర్చిపోకూడదు. దీంతో.. కొత్తగా తమిళనాడు సీఎం ఛార్జ్ ను తీసుకున్న పళని స్వామికి విధేయత ప్రదర్శించే విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదనే చెప్పాలి.

అమ్మ జైలుకు వెళుతూ.. పన్నీర్ ను సీఎంగా చేయగా.. ముఖ్యమంత్రి అయ్యే భాగ్యాన్ని కల్పించిన అమ్మకు అత్యంత విశ్వాసపాత్రుడిగా వ్యవహరించే క్రమంలో సీఎం కుర్చీలో కూర్చోకుండా ఉండటం.. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కుర్చీలో అమ్మ ఫోటోపెట్టేసి.. క్యాబినెట్ మీటింగ్ నిర్వహించటం.. జైల్లో ఉన్న అమ్మను కలిసేందుకు తరచూ వెళ్లి.. సలహాలు సూచనలు తీసుకోవటం తెలిసిందే.

అమ్మ మూడ్ బాగోనప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ ను కలిసేందుకు పరీక్షలు పెట్టినా.. సహనంతో.. ఓర్పుగా వ్యవహరించటం లాంటివి ఇకపై పళని స్వామి అనుభవంలోకి రానున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. పన్నీర్ మాదిరి విధేయతను చాటుకునేందుకు సీఎం కుర్చీలో అమ్మ ఫోటో పెడతారా? చిన్నమ్మ ఫోటో పెడతారా? అన్నది ప్రశ్న.

అమ్మను కొలిస్తే.. చిన్నమ్మ ఇమేజ్ తక్కువ చేసినట్లు అయ్యే అవకాశం ఉంది. మరీ విషయంలో పళనిస్వామి ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. లేని అమ్మకు ఎప్పటి మాదిరే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారా? లేక బతికున్న చిన్నమ్మకు పెద్ద పీట వేస్తారా? అన్నది పెద్ద ప్రశ్న. దీనికి పళని స్వామి వ్యవహారశైలే సరైన సమాధానం చెప్పనుందనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News