దాదాపు వారం పాటు ఉత్కంఠ రేకెత్తించిన తమిళనాడు అన్నాడీఎంకే రాజకీయం కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. అమ్మ అనుచరుడు పన్నీర్ సెల్వం కంటే చిన్నమ్మకు విదేయుడైన పళనిస్వామికే సీఎం పీఠం దక్కింది. అయితే ఆయన బలనిరూపణ చేసుకోవాల్సిన ఘట్టం ఒకటి మిగిలి ఉంది. సెల్వంకు ఉన్న ఎమ్మెల్యేల మద్దతు ప్రకారం ఆయనకు బలనిరూపణ పెద్ద విషయం కాదు. కానీ ఈ మద్దతు ఇచ్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ముట్టజెప్పే డీల్ ఓకే అయిందట.
తమిళనాడు రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం మద్దతిచ్చే ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు చిన్నమ్మ శశికళ సారథ్యంలోని పళనిస్వామి వర్గం ఓకే చెప్పేసిందని అంటున్నారు. సీఎం పళనిస్వామి సహా మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గోల్డెన్ బే రిసార్ట్స్ కు వచ్చిన ఎమ్మెల్యేలకు ఈ డీల్ వివరాలు చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ప్రకారం ఇప్పటికే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.3 కోట్ల అడ్వాన్స్ ముట్టిపోయింది. ఇక మిగతా రెండు కోట్లు బలనిరూపణ సమయంలో మద్దతు ప్రకటించిన అనంతరం అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. అంటే చిన్నమ్మ వర్గంలో ఉన్న ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు ముట్టజెప్పడం ద్వారా చేతులు మారే డబ్బు రూ.600 కోట్లు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/