కేసుల కత్తులు నూరుతున్న పళని..?

Update: 2017-02-19 07:00 GMT
పట్టు పెంచుకోవటానికి చాలానే మార్గాలు ఉంటాయి. చేతిలో ఉన్న అధికారాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వినియోగిస్తుంటారు. చేతిలో పవర్ ఉన్నా.. దాన్ని సొంత ఎజెండా కోసం వినియోగించుకోని నేతలు కొందరు ఉంటారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించే నేతలు మరికొందరు కనిపిస్తారు. చిన్నమ్మకు అత్యంత విశ్వసనీయుడైన తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి తీరుపై ఇప్పుడు పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనలపై విపక్ష నేత స్టాలిన్.. మెరీనా బీచ్ దగ్గర నిరసనకు దిగటం తెలిసిందే. తన చొక్కాను చించేశారంటూ ఆరోపణించిన ఆయన.. అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు.. బలపరీక్ష జరిగిన తీరును ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు. స్టాలిన్ కు జరిగిన అవమానం నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకేవర్గాలు నిరసన ప్రదర్శనలు.. ఆందోళనల్ని చేపట్టాయి.

ఈ పరిణామాలతోతమిళనాడులో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. నిరసనను నిర్వహించిన స్టాలిన్ పైతాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. మెరీనా బీచ్ లోని గాంధీ విగ్రం ముందు ఆందోళనల్ని నిర్వహించి నానా రచ్చ చేసినందుకు ఆయనపై ఎప్ఐఆర్ నమోదు చేశారు. స్టాలిన్ కు జరిగిన అవమానంపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.

స్టాలిన్ కు మద్దతుగా ఎక్కడికక్క ధర్నాలు.. రాస్తారోకోలకు డీఎంకే పక్షాలు రంగంలోకి దిగటంతో చెన్నై.. మదురై.. కోయంబత్తూర్.. ఈరోడ్.. నామక్కల్.. తిరునల్వేలి.. తిరుచ్చిల్లో భారీ ఎత్తున నిరసనలు రాజుకున్నాయి. వీటిని కంట్రోల్ చేయటంతో పాటు.. ఆందోళనలు చేపట్టిన వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాన్ని ఇచ్చేందుకు వీలుగా.. స్టాలిన్ పై కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. నిరసనల గళం ఎంతవరకూ కంట్రోల్ అవుతుందో చూడాలి.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News