కేజీఎఫ్.. ఈ కన్నడ సినిమా దేశవ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) గనులు ఉన్నాయి. ఇక్కడ బంగారం ఉత్పత్తి చేస్తుంటారు. లాక్ డౌన్ అమల్లో ఉండగా.. కొన్ని వారాలుగా కోలార్ బంగారు గనుల్లో బంగారం వెలికితీత నిలిచిపోయింది. కేజీఎఫ్ గనులు మూతపడి ఉన్నాయి.
ఇప్పటికే స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఇప్పటిదాకా టన్నుల కొద్దీ బంగారం బయటపడింది. అయితే ఇప్పుడు ఆ బంగారాన్ని మించిన లోహ నిక్షేపాలు అక్కడ ఉన్నాయని ప్రచారం సాగుతోంది.
తాజాగా కేంద్ర జియాలజిస్టుల సర్వేలో కేజీఎఫ్ లో అంతులేని నిధి బయటపడినట్టు ప్రచారం సాగుతోంది. ఇదే అంశాన్ని స్థానిక బీజేపీ ఎంపీ మునిస్వామి కూడా ధ్రువీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేజీఎఫ్ లో బంగారం నిల్వలు అయిపోవడంతో వదిలేశారు. అయితే అక్కడే ప్లాటినం సమూహానికి చెందిన ‘పల్లాడియం’ అనే లోహం భారీగా ఉందని.. బంగారం కంటే ఎక్కువ విలువైన ఈ లోహాన్ని బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే కేజీఎఫ్ లో బంగారాన్ని మించిన నిధి ఉన్నట్టు తెలుస్తోంది.