ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంఘటన ఏదైనా ఉందంటే అది పనామా పత్రాల్లో వెల్లడైన నల్లధనవంతుల పేర్లే. ప్రపంచంలోని పలు దేశాల అధినేతలు - మాజీ అధ్యక్షులు - క్రీడాకారులు - వ్యాపారవేత్తలు - పారిశ్రామికవేత్తలు - ఇతర రంగాల సెలబ్రిటీలు.. ఒకరేమిటి వేలాది మంది పేర్లు వెల్లడై కొన్ని పదుల దేశాల్లో సంచలనంగా మారింది. మన దేశంలోనూ ప్రముఖుల పేర్లు ఇందులో ఉన్నాయి. ఈ జాబితాలోని భారతీయ ప్రముఖలు ట్రస్టులు - స్వచ్ఛంద సంస్థలతో పాటు రహస్య కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. పన్నులు ఎగవేసి - అక్రమ మార్గాల్లో డబ్బు తరలించిపెట్టుబడులు పెట్టారని... భారత ప్రభుత్వానికి పంగనామాలు పెట్టారని ఆరోపణలున్నాయి. వడోదర - డెహ్రాడూన్ - పాంచ్ కుల - మాంద్సార్ లలో రిజిస్టరయిన అనేక కంపెనీలకు, వాటి అడ్రసులతో సంబంధం లేదని ఈ విచారణలో పాలుపంచుకున్న ఇండియన్ ఎక్ష్ ప్రెస్ పత్రిక వెల్లడించింది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం విదేశాల్లో కంపెనీలు స్థాపించేందుకు భారతీయులకు అవకాశం లేదు. 2004 సంవత్సరం తరువాత మాత్రం 25 వేల డాలర్లవరకు పెట్టుబడులు పెట్టుకునేందుకు స్వేచ్ఛాయుత బదలాయింపు కింద అనుమతి ఇచ్చింది. కాగా ఇప్పుడది రెండు లక్షల 50 వేల డాలర్లకు చేరింది. పనామా పత్రాల ద్వారా వెలుగు చూసిన రహస్య కంపెనీల్లో అత్యధికం.. పెట్టుబడుల నిబంధనలు సడలించిన 2004 కంటే ముందే స్థాపించినవి. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని తిరిగి రప్పించేందుకు భారత ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్న సమయంలోనే లెక్కకు మిక్కిలి పనామా పత్రాలు వెలగుచూడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పన్ను ఎగవేతదారులు తమ ఆస్తులు ప్రకటించడానికి - తప్పులు సవరించుకోడానికి ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అరుణ్ జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రముఖులు పనామా పత్రాల్లో భారతీయులతో పాటు ప్రపంచ ప్రముఖుల పేర్లుకూడా వెలుగుచూశాయి. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కు సమీప బంధువు ఒకరు 2 బిలియన్ డాలర్ల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ - ఐస్ ల్యాండ్ ప్రధాని సిగ్ ముందుర్ గున్ స్లాగ్ సన్ - ఉక్రెయిన్ ప్రధాని పెట్రో పోర్షెంకో - జిన్ పింగ్ - లియోనల్ మెస్సీలు ఉన్నారు.
దాదాపు 500 మంది భారతీ యులు తమ హవాలా సొమ్మును కూడబెట్టేందుకు సెంట్రల్ అమెరికాలో పనామాని ఉపయోగించు కున్నట్టు 'పనామా పత్రాలు' బయట పెట్టాయి. పన్నులు ఎగ్గొట్టేందుకే రహస్య ఖాతాలు ఉపయోగించుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. పనామా పత్రాల ద్వారా వెలుగుచూసిన భారతీయుల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ - ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ - డీఎల్ ఎఫ్ కేపీ సింగ్ తో పాటు ఆయన కుటుంబానికి చెందిన తొమ్మది మంది - లోక్ సత్తా ఢిల్లి విభాగానికి చెందిన అనురాగ్ కేజ్రివాల్ - ఆదానీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ గౌతమ్ ఆదానీ సోదరుడు వినోద్ ఆదానీ - ఇండియా బుల్సు ప్రమోటర్ సమీర్ గెహ్లాట్ తదితరులు ఉన్నారు. పశ్చిమబెంగాల్ కు చెందిన రాజకీయనేత శశిర్ బజోరియా పేరుకూడా వీరి జాబితాలో ఉంది. ఐశ్వర్యరాయ్ అమె తండ్రి రమణరాజ్ కృష్ణ రాయ్ - తల్లి విందా కృష్ణ రాజ్ రాయ్ - సోదరుడు ఆదిత్య రాయ్ డైరెక్టర్లుగా బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్ లో 2005లో ఎమిక్ పార్టనర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. తొలుత ఈ కంపెనీకి డైరెక్టర్ గాఉన్న ఐశ్వర్య రాయ్ తర్వాత షేర్ హోల్డర్ గా మారిపోవడం... మూడేళ్ల సదరు కంపెనీ మూతపడడం గమనార్హం. ఇక అమితాబ్ బచ్చన్ కనీసం నాలుగు విదేశీ షిప్పింగ్ కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నట్టు పనామా పత్రాలు వెల్లడించాయి. 1993లో స్థాపించిన ఈ కంపెనీల్లో ఒకటి బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్ లో ఉండగా మరో మూడు కంపెనీలు బహ్మస్ ఉన్నట్టు తేలింది. వీటితో పాటు భారత ప్రభుత్వం నేతృత్వంలో జరిగిన పలు క్రికెట్ ఫ్రాంచైజీ ఒప్పందాలతో పాటు ఆదాయ పన్ను శాఖ - సీబీఐ - ఐఈ సంస్థలు విచారిస్తున్న పలువురి పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. కంపెనీలు స్థాపిస్తామని చెప్పి మరో 234 మంది భారత పాస్ పోర్టులను సమర్పించినట్టు నివేదిక వెల్లడించింది.
పనామా పత్రాల ద్వారా వెలుగు చూసిన భారతీయుల రహస్య ఖాతాలు - సంబంధిత వ్యక్తులందరిపైనా విచారణ చేపట్టాలని భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదేశించారు. అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్షియం పనామా పత్రాల పేరుతో సమాచారాన్ని వెల్లడించడాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు పన్నులు - విదేశీ ద్రవ్య వినిమయం తదితరం అంశాల్లో నిపుణులైన అధికారుల బృందం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. ఆర్ధిక నేరాలపై పోరాడుతున్న విచారణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ నల్లకుబేరుల కేసులన్నీ నిగ్గుదేల్చనున్నారు.