ఏపీ కరోనా అప్డేట్ : 8 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..కొత్తగా ఎన్నంటే?

Update: 2020-10-23 14:30 GMT
ఏపీలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ కూడా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీలో నమోదు అయిన కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం .... గడిచిన 24 గంటల్లో 3,765 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే మరో 20 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజాగా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 800684కి చేరింది. ఇందులో 31721 కేసులు యాక్టివ్ గా ఉంటె, 762419 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా తో కన్నుమూసిన వారి సంఖ్య 6544కి చేరింది.

తాజాగా నమోదు అయిన కేసుల్ని జిల్లాల వారీగా చూస్తే ... అనంతపురంలో 152, చిత్తూరులో 347, తూర్పుగోదావరి జిల్లాలో 475, గుంటూరులో 523, కడపలో 225, కృష్ణాలో 460, కర్నూలులో 69, నెల్లూరులో 122, ప్రకాశంలో 317, శ్రీకాకుళంలో 199, విశాఖపట్నంలో 218, విజయనగరంలో 126, పశ్చిమ గోదావరిలో 532 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 4,281 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 8,00,684 పాజిటివ్ కేసులకు గాను.. 7,62,419 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 31,721 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Tags:    

Similar News