ఈస్ట్ గోదావరి కేసులు త్వరలో తెలంగాణను దాటిపోతుందా?

Update: 2020-09-03 17:01 GMT
ఏపీలో కరోనా తీవ్రత ఆగడం లేదు. రోజుకు 10వేల కేసుల చొప్పున నమోదవుతున్నాయి. ఏపీలో గడిచిన 24గంటల్లోనే ఏకంగా కొత్తగా 10199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లోనే 6225 మందికి టెస్టులు చేయగా.. ఈ కేసులు బయటపడ్డాయి.

కరోనా కారణంగా 24 గంటల్లో ఏపీలో 74మంది మరణించారు. కరోనా బారినపడి తూర్పు గోదావరిలో 10, చిత్తూరులో 9, గుంటూరులో 9 మంది మరణించారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 4200కు చేరాయి. ఏపీలో ప్రస్తుతం 1,03,701 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కాగా ఏపీలోనే అత్యధిక తీవ్రత తూర్పు గోదావరి జిల్లాలో కనిపిస్తోంది. ఆ జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 1090 కేసులు నమోదవుతున్నాయి. ఒక్కొక్క రోజు 1500 కేసుల దాకా నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా ఇన్నే కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో తెలంగాణను కేసుల్లో తూర్పు గోదావరి దాటిపోతుందా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ఇప్పటివరకు 62900 కేసులు నమోదయ్యాయి. 415మంది చనిపోయారు. తెలంగాణతో సమానంగా ఒక జిల్లాలో కేసులు వెలుగుచూడడం అక్కడ తీవ్రతకు అద్దం పడుతోంది.
Tags:    

Similar News