ప్రపంచంలో కరోనా విలయతాండవం...భారీగా పెరిగిన కేసులు , మరణాలు !

Update: 2020-12-25 09:49 GMT
కరోనా వైరస్...కరోనా వైరస్ ...ఈ పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు. నానాటికి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. అలాగే బ్రిటన్ లో కొత్త వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చి మరింత ఆందోళనకి గురిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 6,65,410 కరోనా కేసులు, 11,722 మంది మృతిచెందారు. మొత్తంగా 7,97,14,538కి కరోనా కేసులు చేరగా, 17,48,455 మంది కరోనావైరస్ తో మృతిచెందారు. అలాగే కరోనా యాక్టివ్ కేసులు 2,18,49,988 ఉంటే, కరోనా నుంచి 5,61,16,095 మంది కోలుకున్నారు.

ఇక అమెరికాలో 1,91,11,326కు కరోనా కేసులు చేరగా, 3,37,066 మంది మృతిచెందారు. ఇక బ్రెజిల్ లో 74,25,593కు కరోనా కేసులు చేరగా.. 1,90,032మంది మృతిచెందారు. భారతదేశంలో కొత్తగా 23,067 కరోనా కేసులు నమోదయ్యాయి. 336 మంది మృతిచెందారు. దేశంలో 1,01,46,845కు కరోనా కేసులు చేరాయి. అలాగే 1,47,092 మంది మృతిచెందారు. భారతదేశంలో 2,81,919 యాక్టివ్ కేసులు ఉండగా..97,17,834మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. తెలంగాణలో 2,84,074కు కరోనా కేసులు చేరాయి. మరో 1,527 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. తెలంగాణలో 6,839 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,75,708 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 16,63,05,762 కరోనా టెస్టులను నిర్వహించారు. అలాగే ల్యాబరేటరీల్లో 2,281 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.
Tags:    

Similar News