భారత్ లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. అయితే కేసుల్లో ఇతర దేశాలను దాటేస్తున్నా.. మరణాల సంఖ్యలో మాత్రం భారత్ లో తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో కరోనా మరణాల సంఖ్య 50000 దాటింది. మృతుల సంఖ్యలో బ్రిటన్ దాటేసిన భారత్... మరణాల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఉత్తర అమెరికా, యూరప్ కంటే భారత్ లో నమోదైన కేసుల సంఖ్య తక్కువగా నమోదైంది.
దేశంలో కరోనా మరణాల రేటు దాదాపు 2శాతమే ఉంది. కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంది. మరణాల రేటు తక్కువగా ఉండడానికి యువ జనాభా కలిగి ఉండడం.. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడమే కారణంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యువత ఎక్కువగా ఉన్న దక్షిణాసియా దేశాల్లో కూడా మరణాలు తక్కువగా ఉన్నాయని వారు సూచిస్తున్నారు. బంగ్లాదేశ్ లోనూ 10లక్షల మందికి మరణాల సంఖ్య 22గా ఉంటే.. పాకిస్తాన్ కు అది 28గా ఉంది. భారత్ లో 34గా ఉంది.
భారత్ లో తక్కువగా ఉన్న మరణాల రేటు మొత్తం వాస్తవాలను చెప్పడం లేదని.. చాలా రాష్ట్రాల్లో ఈ లెక్కలు తక్కువ చేసి చెబుతున్నారని కొందరు భావిస్తున్నారు. నిజానికి 130 కోట్ల మంది ఉన్న భారత్ లో అంత విస్తృతంగా మరణాల లెక్కను కనిపెట్టడం కష్టం. నిజానికి అధికారుల లెక్కలు పారదర్శకంగా ఉన్నా కొన్ని మరణాల సంఖ్య మిస్ అవుతున్నది వాస్తవమని అధికారులు అంగీకరిస్తున్నారు.