ఈ ఏడాది చదువులకు కష్టంగానే ఉండనుంది. ఇప్పటికే టెన్త్ పరీక్షలు తెలంగాణలో హైకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు అదే బాటలో మరిన్ని పరీక్షలు రద్దు దిశగా తెలంగాణ సర్కార్ ఆలోచిస్తుందట.. ఈ సంవత్సరం డిగ్రీ పరీక్షలను సైతం పూర్తిగా రద్దు చేయాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత మరింత ఎక్కువగా విస్తరిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బీఏ, బీఎస్సీ, బీకాం, డిగ్రీ పరీక్షలను సైతం పూర్తిగా రద్దు చేయాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిగ్రీ, బీటెక్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఇన్ చార్జి వీసీలు, రిజిస్ట్రార్లతో సమావేశమయ్యారు. అందరూ పరీక్షలు రద్దు చేసి డిగ్రీ, ఫస్ట్, సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని.. ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పాస్ చేయాలని అధికారులు ప్రతిపాదించారు.
ఇక బీటెక్ పరీక్షల రద్దు అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక రాబోయే విద్యాసంవత్సరం క్లాసుల నిర్వహణపై కూడా అధికారులు చర్చించారు. సీఎం కేసీఆర్ కు ప్రతిపాదనలు పంపి ఓకే అన్నాక అమలు చేయనున్నారు.