రిపబ్లిక్ డే ఏర్పాట్లలో కలకలం

Update: 2020-12-26 12:39 GMT
రిపబ్లిక్ డే వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈసారి ఢిల్లీలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతుండగా.. అంతలోనే కరోనా మహమ్మారి కమ్మేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ వైరస్ ప్రభావం పడుతూనే ఉంది.

తాజాగా ఢిల్లీకి చేరుకున్న వందలాది మంది సైనికుల్లో కొందరికీ కరోనా ఉన్నట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిపబ్లిక్ డే కోసం ఢిల్లీ చేరుకోగానే నిర్వహించిన కరోనా పరీక్షల్లో వీరికి పాజిటివ్ గా తేలింది.

రిపబ్లిక్ డే పరేడ్ కోసం వివిధ బెటాలియన్ల నుంచి ప్రాంతాల నుంచి సైనికులు ఢిల్లీకి వచ్చారు. వేల సంఖ్యలో సైనికులు తరలివచ్చారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించగా దాదాపు 150 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఒక్కసారిగా కలకలం చేలరేగింది.

ఈ ఏడాది కోవిడ్ నిబంధనల ప్రకారం జనవరి 26 పరేడ్ నిర్వహిస్తున్నారు. మాక్ పరేడ్ లు చేయాల్సి ఉంది.అయితే ఏకంగా 150 మంది వరకూ కరోనా సోకడంతో తీవ్ర కలకలం రేపుతోంది. వీరిని వెంటనే క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వీరి కాంటాక్ట్ లను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.

ప్రతి ఏటా సైనికులు వేల మంది పాల్గొనేవారు. ఈ సారి కరోనా ఎఫెక్ట్ తో రిపబ్లిక్ వేడుకలపై ఆ ఎఫెక్ట్ పడింది.
Tags:    

Similar News