ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. మన దేశంలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. దీని బారిన పడి రోజుకి వందల మంది మరణిస్తున్నారు. అయితే కరోనాని జయించిన ఓ వ్యక్తి, ఆసుపత్రి గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.కరోనా మహమ్మారి భారిన పడి , ఆ మహమ్మారి నుండి కోలుకోలేక కొందరు ప్రాణాలు వదులుతుంటే , మరికొందరు కరోనా భయంతో తమకి తాముగా ప్రాణాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ కరోనా రోగి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం మలక్ పేటలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఏమైందో ఏమో కానీ, కరోనాకి చికిత్స పొందుతున్నఆ కరోనా పేషెంట్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రాత్రి 2: 30 గంటల సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ మలక్ పేటలోని యశోద హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. మరణానంతరం అతడి శవానికి మరోసారి కరోనా నిర్దారణ పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు సమాచారం . మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మానసిక ఆందోళన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.