ఒకే ఇంట్లో 32 మందికి కరోనా పాజిటివ్ !

Update: 2020-09-01 13:31 GMT
కరోనా దేశవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అసలు కరోనా మహమ్మారి ఎవరికి ఎలా సోకుతుందో కూడా తెలియడం లేదు. రోజురోజుకి దేశంలో నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతుంది. గత 26 రోజులుగా ప్రపంచం లోనే రోజువారీ కేసుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు, ప్రజాప్రతినిధులతో సహా అందరూ కరోనా భారిన పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లో ఒకే ఫ్యామిలీకి చెందిన 32 మందికి కరోనా పాజిటివ్ ‌గా తేలింది. వీరంతా బండా పట్టణంలో ఒకే ఏరియాలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబంలోని 32 మంది కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపింది. బండాలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన వీరికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని అధికారులు మంగళవారం తెలిపారు. వీరితో పాటు, 44 మందితో కలిసి సోమవారం సాయంత్రానికి జిల్లాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 807కు చేరిందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్ డీ శర్మ ప్రకటించారు. ఇప్పటివరకు జిల్లాలో 807 మందికి కరోనా సోకగా.. 8 మంది మరణించారు. ప్రస్తుతానికి జిల్లాలో 360 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని.. మిగిలిన 439 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆయన తెలిపారు. ఇక దేశంలో ఇప్పటికే 36 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 65 వేలమంది చనిపోయారు. యూపీ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,30,414 కు చేరగా, 3,486 మంది మరణించారు.
Tags:    

Similar News