కరోనా వైరస్ .. కరోనా వైరస్ .. ఇప్పుడు ఈ పేరు వింటే ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది. చైనాలో పుట్టి , అమెరికాలో బీభత్సం సృష్టించి, ప్రస్తుతం ఇండియాని ఊపేస్తుంది. ఇండియా లో ప్రతిరోజూ కూడా దాదాపుగా లక్ష వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో ఇప్పటికే అరకోటి కేసులు నమోదు అయ్యాయి. అయినా కూడా కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. ఇకపోతే , ఈ కరోనా గురించి రోజుకొక వార్త వెలుగులోకి వస్తుంది. తాజాగా భవిష్యత్తులో కరోనా మహమ్మారి కూడా ఒక సీజనల్ వ్యాధిగానే మిగిలిపోతుందని తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా హెర్డ్ ఇమ్యూనిటీ ఎంత త్వరగా సాధిస్తామన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని అంచనా వేసింది.
ఆ పరిస్థితి వచ్చే వరకు ఇది అన్ని సీజన్లలోనూ... దఫదఫాలుగా వ్యాపిస్తూనే ఉంటుందని పేర్కొంది. లెబనాన్ లోని బీరూట్ అమెరికన్ యూనివర్సిటీ ఈ అధ్యయనం చేపట్టింది. శ్వాసకోశ సంబంధ వైరస్ లు సీజన్ల వారీగా ఎలా విజృంభిస్తున్నాయి, కరోనా వైరస్ తీరు భవిష్యత్తులో ఎలా ఉండనుంది, అన్న అంశాలపై శాస్త్రవేత్తలు తులనాత్మకంగా అధ్యయనం చేపట్టారు. సామాజికంగా రోగనిరోధకత పెరిగితే కరోనా వ్యాప్తి తగ్గిపోతుంది. తర్వాత సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే ఈ వైరస్ ఉనికి కనిపిస్తుంది. అప్పటివరకూ ఈ మహమ్మారి అన్ని సీజన్లలోనూ వ్యాపిస్తూనే ఉంటుంది. ప్రజలు కూడా కరోనాతో సహజీవనం చేయడానికి అలవాటు పడాలి. మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి అని పరిశోధనకర్త హసన్ జారాకేత్ తెలిపారు.