తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మాటలు కాదు. ఆయన్ను కలవాలంటే చాలానే అదృష్టం ఉండాలి. తనను కలిసేందుకు వచ్చే సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు సైతం అనుమతి ఇవ్వని వైనం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. ఏదో సమస్య చెప్పేందుకో.. పైరవీ చేసేందుకో కాదు.. ఇంట జరుగుతున్న వేడుక్కి రమ్మని పిలిచేందుకు వచ్చిన ఏపీ ఎంపీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. గతంలో ఇలాంటి చేదు అనుభవాలు కొన్ని ఉన్నా.. తాజా ఉదంతం మాత్రం దారుణమైనదని చెబుతున్నారు.
అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తెలుసు కదా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన ఆయన.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. తన కుమార్తె పెళ్లి సందర్భంగా శుభలేక ఇద్దామని ఆయన భావించారు. ఇందుకోసం సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. ఎంపీ స్టిక్కర్ అంటించిన వాహనంలో ఆయన లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. నో చెప్పేశారు సిబ్బంది.
తాను ఫలానా అని చెప్పి.. తాను పెళ్లికార్డు ఇచ్చేందుకు వచ్చినట్లుగా క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి తెలియజేశారు రవీంద్రబాబు. అయినప్పటికీ ఆయన్ను అనుమతించలేదు. కావాలంటే తన గురించి చెక్ చేసుకోవాలని చెప్పగా.. మండే ఎండలో అరగంట పాటు నిలబెట్టిన వారు.. తర్వాత అనుమతించేందుకు నో చెప్పేశారు. దీంతో.. తాను పెళ్లి కార్డు ఇచ్చినట్లుగా చెప్పండంటూ పెళ్లికార్డు అక్కడ పెట్టి తిరిగి వెళ్లిపోయారు.
ఇలాంటి అనుభవాన్ని తాను అస్సలు ఊహించలేదని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎంపీగా ఇంత దారుణమైన అవమానం తనకెప్పుడూ ఎదురుకాలేదన్నారు. తనకు ఎదురైన అవమానం ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి అన్న ఆయన.. ఈ తరహా ట్రీట్ మెంట్ ను తెలంగాణలోని ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎలా ఎదుర్కొంటున్నారన్న ఆశ్చర్యాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీఎం వ్యక్తిగత సిబ్బంది తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఒక ఎంపీ తన కుమార్తె పెళ్లికార్డు ఇవ్వటానికి వచ్చినా కేసీఆర్ కాదనటం ఏమిటి? ఇంతకీ ఏపీ ఎంపీ ఒకరు.. తన సిబ్బంది కారణంగా దారుణ పరాభవానికి గురైన సంగతి కేసీఆర్ కు తెలుసా?