క‌రోనా వ్యాప్తికి కార‌ణం ఈ జంతువే!

Update: 2020-02-09 01:30 GMT
ప్ర‌స్తుతం క‌రోనా పేరు చెబితేనే ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ త‌మ దేశంలోకి చొర‌బ‌డ‌కూడదంటూ ప్ర‌జ‌లు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఓ వైపు క‌రోనా వైర‌స్‌ కు విరుగుడు క‌నిపెట్టే ప‌నిలో ప‌లువురు శాస్త్ర‌వేత్త‌లు త‌ల‌మున‌క‌లై ఉన్నారు. మ‌రో రెండు మూడు నెలల్లో క‌రోనాకు యాంటీడోట్ అందుబాటులోకి తెస్తామ‌ని బ్రిట‌న్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు పాములు - గ‌బ్బిలాల వ‌ల్లే క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌ని భావించిన శాస్త్ర‌వేత్తులు...తాజాగా క‌రోనా వ్యాప్తికి అలుగు(పొంగొలిన్) కార‌ణ‌మ‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  చైనాలోని ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్లే క‌రోనా వ్యాప్తి చెందింద‌ని - పాములు - గ‌బ్బిలాలు తిన‌డం వ‌ల్లే ఈ మ‌హ‌మ్మారి ప్రపంచానికి దాప‌రించింద‌ని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అంతేకాకుండా - గ‌బ్బిలాన్ని తిన్న‌వారు గ‌బ్బిలంలా అరుస్తున్నారని....సోష‌ల్ మీడియాలో ఫేక్ వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు క‌రోనా వ్యాప్తికి పాములు - గబ్బిలాలు కార‌ణం కాద‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు స‌రికొత్త వాద‌న తెర‌మీద‌కు తెచ్చారు. తొలుత ఆ వాద‌న‌ను బ‌ల‌ప‌రిచిన‌ శాస్త్రవేత్తలు తాజాగా - అలుగు (పాంగొలిన్) కూడా క‌రోనాకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. అలుగు జన్యుక్రమం కరోనా వైరస్‌ తో 99 శాతం మ్యాచ్ అవుతోంద‌ని చెబుతున్నారు. వైరస్ వ్యాప్తికి ఇదే కారణం అయి ఉండ‌వ‌చ్చ‌ని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంటున్నారు.


Tags:    

Similar News