తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మృతిపై ఆమెకు అత్యంత విధేయుడు.. వినయపాత్రుడు.. ఆమెకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా.. ముఖ్యమంత్రి సీటులో కూర్చుని అమ్మకు విధేయతగా చక్రం తిప్పిన పన్నీర్ సెల్వం.. సంచలన విషయాలు వెల్లడించారు.
జయలలితకు వైద్యం చేస్తున్న ఆసుపత్రిలో సీసీ కెమెరాలు తీసేయమని చెప్పలేదని, అసలు తాను చాలా సీరియస్‌గా ఆ విషయంలో వ్యవహరించానని.. కానీ, కొందరు మంత్రులు మాత్రం ఉదాసీనంగా ఉన్నారని.. ఆయన చెప్పుకొచ్చారు. తమిళనాడు సీఎం మృతిపై ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించిన అనేక అనుమానాల నేపథ్యంలో గత అన్నాడీఎంకే ప్రభుత్వం.. విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య కమిటీ గత రెండేళ్లుగా దీనిపై విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే.. కరోనా నేపథ్యంలో కొన్నాళ్లు ఈ విచారణకు ఆటంకం కలిగినా.. మళ్లీ ఇటీవల విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా మాజీ సీఎం, అమ్మకు అత్యంత విధేయుడు అయిన..పన్నీర్‌ను విచారణ కమిటీ విచారించింది.
ఈ సందర్భంగా పన్నీర్ సంచలన విషయాలు వెల్లడించారు. జయలలితకు చికిత్స జరుగుతున్న సమయంలో సీసీ కెమెరాలను తొలగించాలని తాను చెప్పలేదన్నారు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించానని తెలిపారు.
అంతేకాదు.. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం.. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ కుమార్, సీఎస్ రామ్ మోహన్ రావు లతో చర్చించానని విచారణ కమిటీకి చెప్పారు. అయితే.. దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వెల్లడించారు.
ఆ తరువాత శశికళ చొరవతోనే విదేశీ వైద్యులు వచ్చారని, జయలలితకు వారు ట్రీట్‌మెంట్ ఇచ్చారని విచారణ కమిషన్‌కు విచారించారు. అంటే.. ఇప్పటి వరకు అందరూ శశికళ అమ్మకు ఏమీ చేయలేదనే వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో పన్నీర్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు.. తన ప్రభుత్వంలోనే కొందరు అమ్మకువ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చినట్టు అయింది.
ఇదిలావుంటే, 2016, డిసెంబర్ 5వ తేదీన జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. జయ మృతి వెనుక భారీ కుట్ర దాగి ఉందంటూ జయ సోదరుడి బిడ్డలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో.. 2018లో జయ మృతి మిస్టరీని తేల్చేందుకు రిటైర్డ్ జస్టిస్ ఆర్ముగం నేతృత్వంలో విచారణ కమీషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురిని విచారించిన ఆర్ముగం కమీషన్.. ఓపీఎస్‌కు కూడా విచారణ కోసం నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయన విచారణకు హాజరవలేదు. తాజాగా ఈ కమిషన్ ఓపీఎస్‌కు సమన్లు జారీ చేయడంతో.. విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.