మరణించిన వారిని మమ్మీలుగా మార్చే సంస్కృతి ఎక్కడుందంటే 'ఈజిప్ట్' అని ఠక్కున చెప్పేస్తాం. ఎందుకంటే.. ఈజిప్టులో రాజ కుటుంబీకులు చనిపోతే వారి శరీరాలను మమ్మీలుగా మార్చే పద్ధతి అక్కడ ఉండేదని చదువుకున్నాం కాబట్టి. అయితే ఈజిప్టులో ఆ సంస్కృతికి ఎప్పుడో కాలం చెల్లింది. కానీ ఇండోనేసియాలో మాత్రం నేటికీ ఈ మమ్మిలను తయారుచేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పశ్చిమ ఇండోనేసియాలోని కొన్ని కొండ ప్రాంత గ్రామాల్లో "దాని" అనే గిరిజన తెగలు జీవిస్తున్నాయి. ఈ గిరిజన తెగకు చెందిన ప్రజలు మాత్రం ఇంకా మరణించిన వారిని మమ్మీలుగా చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
పశ్చిమ ఇండోనేసియా జయవిజయ రీజెన్సీలోని కొన్ని కొండ ప్రాంత గ్రామాల్లో నివసించే "దాని" అనే గిరిజన తెగలు చనిపోయిన గ్రామపెద్దలను మమ్మీలుగా మార్చే సంస్కృతి నేటికీ కొనసాగిస్తున్నారు. ఇలా శవాలను మమ్మీలుగా మార్చడానికి వీరు ఎంచుకున్న మార్గం పొగద్వారా మమ్మీలుగా మార్చడం.. దీన్నే స్మోక్ మమ్మీఫికేషన్ అంటారు. సాదారణంగా ఈజిప్టులో మమ్మీలను తయారుచేసేక్రమంలో లవణాలను - జిగురువంటి పదార్థాలను వాడేవారు కాని.. వీరుమాత్రం పొగను ఉపయోగిస్తున్నారు. మరణించిన వారి మృతదేహాన్ని ముందుగా ఒక గుడిసెలో ఉంచి దానికి నెలరోజులపాటు పొగరాజేస్తారు. అలా తయారైన మమ్మీలను ప్రతీ సంవత్సరం ఆగస్టు నెలలో జరిగే వారి తెగ ఉత్సవాల్లో ప్రదర్శనకు ఉంచుతారు. నల్లగా మాడిపోయి ముడుచుకుపోయి కట్టెలమాదిగిరిగా కనిపించే ఈ మమ్మీలను చూసేందుకు, ఈ గిరిజనుల తెగ ఉత్సవాలను తిలకించేందుకు అక్కడికి ఈమధ్యకాలంలో చాలామంది వెళ్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ప్రచార కార్యక్రమాలు ఎక్కువగానే కల్పిస్తోంది.
కాగా 1938లో ఓ అమెరికన్ జువాలజిస్టు "దాని" అనే ఈ తెగ ఉనికిని ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పటి నుంచి వందల ఏళ్లుగా వారి జీవన విధానాలపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అరుదైన ప్రక్రియగా భావించే ఈ స్మోక్ మమ్మిఫికేషన్ (పొగద్వారా శవాన్ని మమ్మీగా మార్చే ప్రక్రియ) వీరివద్ద ఉంది. దీని ద్వారానే తమ పూర్వీకుల శరీరాలను భద్రపరుస్తున్నారు.