రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పలువురు మహిళా నేతలు రాఖీలు కట్టి రాఖీ ఫౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన చంద్రబాబు కాస్త అస్వస్థతకు గురయ్యారు. ఆయన చేతి నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
మంగళవారం గుంటూరులో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి సైతం ఆయన చేతికి కట్టుతోనే హాజరయ్యారు. వైద్యులు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఇదే టైంలో కృష్ణా కరకట్ట వద్ద ఆయన నివాసం ఉంటోన్న లింగమనేని గెస్ట్ హౌస్ ముంపునకు గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్ కు వెళ్లిపోయారు.
ఇక బుధవారం రాఖీ సందర్భంగా ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత - తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బాబుకు రాఖీ కట్టారు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి చేరుకున్న మహిళా నేతలు బాబుకు రాఖీ శుభాకాంక్షలు తెలిపి... ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక మాజీ మంత్రి సునీతతో పాటు అటు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క ఇద్దరికి చంద్రబాబు రాజకీయంగా కీలక స్థానం కట్టబెట్టారు.
సునీతకు గత కేబినెట్ లో చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. ఇక సీతక్క రాష్ట్రం వేరైనా - పార్టీ మారినా కూడా చంద్రబాబు దగ్గరకు వచ్చి రాఖీ కట్టి మరీ ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు. ఆమె గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచి ప్రతిసారి బాబు వద్దకు ప్రతి రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది.