ఒక ముఖ్యమంత్రి పట్టుదలతో అనుకుంటే ఏం జరుగుతుందన్న దానికి నిదర్శనంగా పట్టిసీమ ప్రాజెక్టు గురించి చెప్పాల్సిందే. ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని..రికార్డు సమయంలో పూర్తి చేసిన ప్రాజెక్టుగా పట్టిసీమ నిలుస్తుందనటంలో సందేహం లేదు. 14 నెలల బాబు పాలనలో ఏం చేశారనటానికి నిలువెత్తు నిదర్శనంగా పట్టిసీమ ప్రాజెక్టును చూపించే వీలుందని చెబుతున్నారు. బాబు పాలనా సమర్థతకు ఇంతకు మించిన ఉదాహరణ ఏం ఉంటుందన్న భావన తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.
పట్టిసీమపై రచ్చ ఓ పక్క జరుగుతున్నా.. మరోపక్క అంతే తీవ్రస్థాయిలో పనులు జరగటం గమనార్హం. రికార్డు సమయంలో పట్టిసీమ ప్రాజెక్టును కట్టేసి.. రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లటం ద్వారా.. చంద్రబాబు సమర్థతను.. ఆయనేమైనా చేయగలరన్న పేరు ప్రఖ్యతులు సొంతం చేసుకోవటంతోపాటు.. ఏపీ రాజధాని నిర్మాణం అయితే గియితే చంద్రబాబుతోనే సాధ్యమన్న భావన కలిగించేందుకు పట్టిసీమ ప్రాజెక్టు కలిగిస్తుందన్న భావన ఎప్పటినుంచో ఉన్నదే.
ఎప్పుడు మొదలు పెట్టారన్న దానిపై పెద్దగా అవగాహన లేకుండా.. ఎప్పటికి పూర్తి అవుతుందో అన్నమాట అనుకున్నంతనే..పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయటమే కాదు.. ప్రాజెక్టును పూర్తి చేయటమేకాదు.. శనివారం (ఆగస్టు 15) జాతికి అంకితం చేయనున్నారు. అంతేకాదు.. వారం.. పది రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి నీళ్లను తీసుకెళ్లి.. అక్కడ నుంచి రాయలసీమకు తరలించాలని భావిస్తున్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు పూర్తితో.. పోలవరం మీద ఇదే రీతిలో పని చేస్తామని చంద్రబాబు చెప్పే వీలుందంటున్నారు. పట్టిసీమ పనుల వేగం గురించి ఒక అధికారి చెబుతూ.. నెల రోజుల వ్యవధిలో 1.5కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని ఎత్తి పోవటం చూస్తేనే.. పట్టిసీమ ప్రాజెక్టులో పనుల వేగం తెలుస్తుందని చెబుతున్నారు. త్వరగా పనులు పూర్తి కావటం కోసం భారీ యంత్రాలతో పాటు.. ప్రాజెక్టు సైట్ నుంచి సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేసి మరీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పనుల్ని పర్యవేక్షిస్తున్న తీరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఆగస్టు చివరకు ట్రయిల్ రన్ పూర్తి చేసి.. కుడి కాలువ ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని తరలించాలని బాబు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. పట్టిసీమకు మరో ప్రత్యేకత ఉందని.. నదుల అనుసంధానంలో మొదటి అడుగు అవుతుందని.. దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానించిన మొదటి ప్రాజెక్టుగా నిలిచిపోతుందని చెబుతున్నారు. గోదావరి.. కృష్ణా అనుసంధానం అయ్యాక.. సోమశిల.. పెన్నాలను అనుసంధానం చేయాలని భావిస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. నెలాఖరకు పట్టిసీమ ప్రాజెక్టు పనులు పూర్తి అయినా.. పూర్తిస్థాయిలో వినియోగం మాత్రం 2016 జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతన్నారు. మొత్తానికి పట్టిసీమ ప్రాజెక్టు వ్యవహారం మొత్తం బాబుకు సర్కారు పెద్ద మైలేజీ ఇవ్వటం ఖాయమంటున్నారు.