పవన్ కల్యాణ్.. చెప్పేవి నీతులు, మాట్లాడేది ఇలానా

Update: 2019-11-04 09:50 GMT
తను వ్యక్తిగత ఆరోపణలు చేయనంటూ తరచూ చెప్పుకుంటూ ఉంటారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. తను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానంటూ పవన్ కల్యాణ్ చెబుతూ ఉంటారు. అలాంటి నీతులు చెప్పేటప్పుడు పవన్ కల్యాణ్  మాటలకు హద్దే ఉండదు!

అయితే తను మాట్లాడింది తనే పాటించని వ్యక్తి జనసేన అధిపతి. ఈ క్రమంలో వ్యక్తిగత విమర్శల నీతులను కూడా పవన్ తుంగలో తొక్కుతారు. తాజాగా ఆయన మరోసారి అలాగే వ్యవహరించారు.

విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కల్యాణ్ తన అతుకులబొంత ప్రసంగంలో.. ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మీద, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీద అనుచితమైన మాటలే మాట్లాడారు. వ్యక్తిగత విమర్శలకు దిగారు.

తన విషయంలో వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని పవన్ తరచూ చెబుతూ ఉంటారు. తను మాత్రం ఎవరి గురించి అయినా ఏదైనా  మాట్లాడవచ్చనేది పవన్ లెక్క.ఇది వరకూ కూడా ఆయన అదే తీరున వ్యవహరించారు. ఇప్పుడూ అదే రీతిన వ్యవహరిస్తూ ఉన్నారు.

చెప్పేవి నీతులు.. మాట్లాడేది మాత్రం ఇలా. అందుకే జనాలకు కూడా పవన్ రాజకీయం మీద పెద్దగా సీరియస్ నెస్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.

అలాగే విశాఖలో పవన్ ప్రసంగం పూర్తి స్థాయిలో టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిందనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తం ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ చదివి  వినిపించారు. పేపర్లను చూస్తూ మాట్లాడారు. ఎవరో రాసిచ్చింది పవన్ చదివారని తేటతెల్లం అవుతోంది. ఆ రాతలు తెలుగుదేశం కార్యాలయం నుంచి వచ్చినవే అనే టాక్ సాగుతూ ఉండటం గమనార్హం!
Tags:    

Similar News