బీజేపీ పొత్తుపై పవన్ కీలక వ్యాఖ్యలు విన్నారా?

Update: 2022-06-04 03:18 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్ని చాలామంది జాగ్రత్తగావినరు. ఆయన కూడా కీలకమైన విషయాల వద్ద అందరూ అండర్ లైన్ చేసుకునేలా మాట్లాడరు. తనదైన ఫ్లోలో చెప్పేసుకుంటూ వెళతారు. ఎవరికి వారు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఆయన మాటల్ని వింటే.. తన మనసులోని భావాల్ని మాటల రూపంలో చెప్పేస్తుంటారు.

తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. గడిచినకొంతకాలంగా బీజేపీ చేతిలో రిమోట్ గా మారిపోయారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. అందుకు భిన్నంగా తనకు.. బీజేపీకి మధ్యనున్న అనుబంధంపై క్లారిటీ ఇచ్చేశారు.

ఇంతకాలం బీజేపీతో పొత్తు పక్కా అన్నభావనలో ఉన్న వారికి షాకిచ్చేలా ఉన్నాయి తాజా వ్యాఖ్యలు. తాజాగా మంగళగిరిలో విలేకరులతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కోఆర్డినేషన్ లేదనే వాదన తప్పని చెబుతూనే.. అదేసమయంలో ఎన్నికల్లో కలిసి వెళ్లాలా? వద్దా? అన్న డౌట్ క్రియేట్ చేసేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

జనసేన - బీజేపీ మధ్య రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ‘‘బీజేపీ.. జనసేన మధ్య సమన్వయం లేదని అనుకోవాల్సిన అవసరం లేదు. నాయకులం అంతర్గతంగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. బీజేపీ నుంచి జనసేన ఎలాంటి రోడ్ మ్యాప్ తీసుకోలేదు.

మేం కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఎలా ముంుదకు వెళ్లాలో చర్చలు జరుగుతాయి’’ అని చెప్పిన వ్యాఖ్యల్లో.. తాము కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత అన్న పవన్ మాటను చూస్తే.. ఎన్నికల్లో మిత్రుడితో మాత్రమే కలిసి వెళ్లే అవకాశం ఏమీ ఉండదనే విషయాన్ని ఆయన చెప్పేయటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.

తాజాగా పవన్ వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.. లేదంటే మరొకరితో మైత్రి కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి దిగుతామన్న సందేశాన్నితన మాటలతో చెప్పారని చెప్పాలి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ చేతిలో పవన్ రిమోట్ గా మారారన్న మాటలు ఏ మాత్రం సరికాదన్న విషయాన్ని జనసేనాని తేల్చేశారన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కీలకమైన వేళ పవన్ చేసిన కీలక ప్రకటన కొత్త రాజకీయ సమీకరణాలకు సమయం మించి పోలేదన్న విషయాన్ని చెప్పినట్లైందని చెప్పాలి.
Tags:    

Similar News