సెంటిమెంట్ కు భయపడుతున్న పవన్?

Update: 2019-12-27 06:16 GMT
జల్సా మూవీ లో భయం అంటే తెలియని విలన్ కు భయాన్ని టన్నుల లెక్కన ఇస్తానని ఇదే పవన్ కళ్యాణ్ తొడగొట్టాడు... రీల్ లో ఓకే.. మరి రియల్ లో భయపెడుతున్నాడా? భయపడుతున్నాడా? అంటే నిజంగా భయంతో ఒత్తిడిలోకి వెళ్లిపోయాడని తెలుస్తోంది..

పవన్ ఇప్పుడు భయంతో తన అభిప్రాయాన్ని కూడా వాయిదా వేసుకున్న పరిస్థితిని చూస్తున్నాం.. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ట్విట్టర్ లో వేగంగా స్పందించి చెడామడా ఖండించే పవన్ కు ఈ మధ్య బాగానే స్ట్రోక్ పడింది. ఏపీకి మూడు రాజధానులు అవసరం అని జగన్ ప్రకటించగానే ట్విట్టర్ లో ఖండించి నానా రచ్చ చేసిన పవన్ కు ఉత్తరాంధ్ర, సీమ వాసుల నుంచి నిరసన సెగ తగిలింది. ప్రశ్నించే పవనే ట్విట్టర్ లో సీమ, ఉత్తరాంధ్రులు ప్రశ్నించేసరికి పవన్ వెనక్కితగ్గాడు. అమరావతి స్టాండ్ ను వెనక్కి తీసుకొని మౌనంగా ఉండిపోయాడు.

ఇప్పుడు సీఎం జగన్ ఈరోజు కేబినెట్ మీటింగ్ లో విశాఖను ఏపీకి పరిపాలన రాజధాని గా చేయబోతున్నట్టు ప్రకటన వెలువరించబోతున్నారట.. మరి దీనిపై వేగంగా స్పందించకుండా పవన్ కళ్యాణ్ ఈ నెల 30వ తేదీన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

పవన్ కళ్యాణ్ ఈ మూడు రోజులు చర్చించి సమాలోచనలు చేసి పరిశోధన గావించి ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పై ఈనెల 30న  స్పందిస్తారన్నమాట.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై ఎలాగైతే ఉమ్మడి రాష్ట్రంలో నేతలు స్పందించకుండా భయపడ్డారో.. ఇప్పుడు అదే పరిస్థితి పవన్ కు ఎదురైంది. అమరావతి కావాలంటే ఉత్తరాంధ్ర, సీమలో పవన్ అడ్రస్ గల్లంతవుతుంది. అదే ఉత్తరాంధ్ర, సీమకు సపోర్టు చేస్తే అమరావతి లో దెబ్బై పోతారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోలేక పవన్ మౌనం దాల్చారు. ఈనెల 30న తీరిగ్గా దీనిపై ఆలోచించి నిర్ణయం చెబుతున్నాడు. ఇలా పవన్ ప్రజల ఆకాంక్షల కు తొలిసారి గా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.


Tags:    

Similar News