రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే పార్టీ అధినేత ఎదుర్కోనన్ని విమర్శలు..వ్యక్తిగత ధూషణలు ఎదుర్కొన్న ఏకైన అధినాయకుడిగా కనిపిస్తారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎందుకిలా? ఆయన్ను ఎందుకింతలా టార్గెట్ చేస్తారు? తన మానాన తాను బతుకుతూ.. తనకు నచ్చిన పనులు చేస్తూ.. కోరిన వారికి కాదనకుండా సాయం చేస్తూ.. సంపద పోగేసుకోకుండా.. ఉన్న కాసిన్ని డబ్బుల్ని ఎప్పటికప్పుడు దాన ధర్మాలు చేసే పవన్ అంటే ఎందుకంత మంట? అన్న ప్రశ్న చాలామంది నోటి నుంచి వస్తుంటుంది.
ఒక్కసారి గతాన్ని చూస్తే.. ఏ సందర్భంలోనూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ టార్గెట్ చేసిన దాఖలాలు కనిపించవు. ఆ మాటకు వస్తే తనను టార్గెట్ చేసి మాటలు అన్నా.. ఒకట్రెండు సార్లు ఓపికగా ఊరుకుంటారే కానీ.. మిగిలిన రాజకీయ నేతల మాదిరి కాట్ల కుక్కల్లా విరుచుకుపడరు. అంతటి సహనం అతని సొంతం. సమకాలీన రాజకీయాల్లో ఓర్పుగా ఉంటూ.. నిజాయితీగా మాట్లాడే అతి కొద్దిమంది రాజకీయ అధినేతల్లో ఆయన్ను ఒకరిగా చెప్పాలి. పార్టీ పెట్టిన ప్పటి నుంచి చందాల రూపంలో పార్టీ ఆస్తుల్ని పెంచేసుకోవటం.. వ్యక్తిగతంగా తమ డాబును.. దర్పాన్ని ప్రదర్శించటమే తప్పించి.. తనకున్న ఆస్తుల్ని దానాలు.. సాయం కోసం వచ్చే వారి కోసం హారతి కర్పూరంగా కరిగించేసే అధినేతల్ని ఎక్కడైనా చూశారా? ఆ లక్షణం పవన్ లోనే కనిపిస్తుంది.
ఆయన్ను తరచూ ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. వారు చేసే తప్పుడు సోషల్ ప్రచారంలోనూ హ్యాష్ ట్యాగ్ గా పెడుతుంటారు. నిజంగానే.. పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకొని ఉండి ఉంటే.. అంత భారీ మొత్తాన్ని ఎక్కడో ఒక దగ్గర ఉంచాలి కదా? డబ్బును నేలమాళిగల్లో దాచేయరు కదా? దేనిలో ఒక దాన్లో పెట్టుబడి పెట్టటమో.. వేరేలా వ్యాపారం చేయటమో లాంటివి చేస్తారు కదా? మరి.. అలా చేసి ఉంటే.. ఈసారి ఆయనపై కత్తి కట్టి.. పూనకం వచ్చినట్లుగా ఊగిపోయే వైసీపీ బ్యాచ్ ఈసాటికి వాటికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టేది కదా?
ఒకవేళ ఆధారాలు దొరకనంత తెలివిగా దాచి ఉంచారనే అనుకుందాం. కనీసం వాటి ఆనవాళ్ల బొక్కల్ని దండగా పేర్చి మరీ.. సోషల్ మీడియాలో కరాళ నృత్యం చేసేవారు కదా? అలా కాకుండా.. కేవలం మాటలు.. ఉత్త మాటలు.. అవి కూడా పనికిరాని మాటలు తప్పించి.. ఇప్పటివరకు ఆధారాలు చూపించి.. ఇదిగో ఇక్కడ తప్పు చేశాడన్న చిన్నపాటి రుజువును కూడా చూపించలేని పరిస్థితి. తాము ఎంతలా శోధించినా.. పవన్ వ్యక్తిత్వాన్ని క్వశ్చన్ చేయలేని పరిస్థితిని.. తమ చేతకానితనాన్ని ఒప్పుకోవటం ఇష్టం లేక.. వ్యక్తిగత జీవితాన్ని భూతద్దంలో చూపిస్తూ.. బూతుగా అభివర్ణించటం చేస్తుంటారు.
పవన్ కల్యాణ్ సంగతి కాసేపు పక్కన పెడదాం. నిత్యం నంగనాచిలా నీతులు చెప్పేటోళ్లు.. పవన్ అలా చేయొచ్చుకదా? ఇలా చేయొచ్చు కదా? ఆయనలో ఆ పాయింట్ మిస్ అయ్యింది? ఈ యాంగిల్ సరిగా లేదు? లాంటి చచ్చు మాటలు చెప్పేటోళ్లు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేతల్లో ఎంతమంది చీకటి బతుకులు ఉన్నాయి? ఊళ్లకు వెళ్లి మాట్లాడాలే కానీ.. ఒక్కొక్కరి భాగోతాలు ఎంత భారీగా ఉంటాయో తెలియనివా? వాటి గురించి మాట్లాడే దమ్ము.. ధైర్యం లేనోళ్లు పవన్ గురించి మాట్లాడటమా?
నిజానికి పవన్ తలుచుకుంటే.. అందరి భాగోతాలు విప్పి చెప్పటం పెద్ద విషయం కాదు. కానీ.. తాను నమ్మిన విలువల్ని తనను ఎంతలా ఇబ్బంది పెడుతున్నా.. ఆ విలువల మీదనే ఉండాలని తపించటమే చాలామంది రాజకీయ నేతల బతుకులు బజారున పడకుండా ఉన్నాయన్నది మర్చిపోకూడదు. ఆయన సహనంతో చాలామంది బతికిపోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నాడే.. తన ప్రాణాల్నిఇచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుచెప్పటమే కాదు.. చాలా సందర్భాల్లో చేతల్లో చూపించారు కూడా. ఏ రాజకీయ అధినేత స్పీడ్ గా వెళ్లే కారు బాయినెట్ మీద కూర్చునే దమ్ము.. ధైర్యం ఉంది. ఇదేదోఅతి కోసంచేసేది కాదు.. తాను ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాన్ని ఇచ్చేందుకే.. అన్న విషయం పవన్ ను విమర్శించే వారికి తెలుసు?
పవన్ మీద నిత్యం ఏదో ఒక విష ప్రచారం చేస్తారెందుకు? ఎందుకంతలా టార్గెట్ చేస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానం చాలా సింఫుల్. పవన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారురాజకీయాల్లో కొనసాగితే.. అందరిలోనూ అలాంటి విలువల్నే కోరుకుంటారు. అందుకే.. ఆ విలువల్ని వీలైనంతగా బూతు మాదిరి మార్చేయాలన్న వ్యూహంలో భాగంగానే పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటారు. వైసీపీకి ఉన్న ఒకే ఒక్క ఫియర్ పవన్. అందుకే ఆయన్ను టార్గెట్ చేస్తుంటారు. అందుకోసం తమ సర్వశక్తుల్ని ఒడ్డుతుంటారు. నిజంగా పవన్ కానీ తప్పులు చేసి ఉంటే.. ఇంతకాలం ఊరుకునే వారా? కనీసం ఒక యాభై కేసుల్లోనో.. వంద కేసుల్లోనో భాగస్వామిని చేసేసి అరెస్టు చేసే వారు కదా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.