జ‌గన్ మాట‌లకు ప‌వ‌న్ హ‌ర్ట‌య్యాడు పాపం!

Update: 2018-12-06 15:28 GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... ఉత్త‌రాంధ్ర‌కు వెళ్తాడు. ప‌క్క‌నే ఉన్నాడు జ‌గ‌న్ ఉత్త‌రాంధ్ర‌కు రాడు అంటాడు.
గోదావ‌రి జిల్లా వెళ్తాడు... జ‌గ‌న్‌కు నీకు పౌరుషం లేదా?
అనంత‌పురం పోయాడు... జ‌గ‌న్ అసెంబ్లీలో ప్ర‌శ్నించ‌వా? అంటాడు.

ప‌వ‌న్ పేప‌రు చ‌ద‌వ‌డం లేదా? టీవీ చూడ‌టం లేదా? అని అనుమానం వ‌స్తుంది. ఎందుకంటే పాద‌యాత్ర పొడుగునా ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో జ‌గ‌న్ ప్ర‌తి స‌మ‌స్య‌పైనా ముఖ్య‌మంత్రిని నిల‌దీశారు. ఏ విష‌యాన్నీ వ‌ద‌ల్లేదు. అయినా, వాట‌న్న‌టినీ గ‌మ‌నించ‌ని ప‌వ‌న్ జ‌గ‌న్‌ ను ప్ర‌శ్నిస్తుంటాడు. ఓటు వేయండి... ప‌నిచేయ‌క‌పోతే నేను ప్ర‌శ్నిస్తాను చూసుకుంటాను అని తెలుగుదేశానికి ఓటేయించిన ప‌వ‌న్ ఇపుడు ప్ర‌శ్నిస్తున్నాడు... చంద్ర‌బాబును కాదు - ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్‌ ను ప్ర‌శ్నిస్తున్నాడు. ఇదో విచిత్ర‌మైన రాజ‌కీయం.

అయినా ఇక్క‌డ అర్థం కాని విష‌యం ఏంటంటే... జ‌న‌సేన ఎందుకు ప్ర‌శ్నించ‌కూడ‌దు. రాజ‌కీయ పార్టీ పెట్టి తానే సీఎం అవుతున్నాన‌ని న‌మ్ముతున్న ప‌వ‌న్ ఇక జ‌గ‌న్‌ ను ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం ఏముంది? నేను వ‌స్తున్నాను - ఇవ‌న్నీ చేస్తాను అని ప్ర‌క‌టించొచ్చు. లేదా ముఖ్య‌మంత్రి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే వ‌ర‌కు నిరాహార‌దీక్ష చేయొచ్చు. నిర‌స‌న‌లు చేప‌ట్టొచ్చు. ర్యాలీలు తీయొచ్చు. స‌మ‌స్య ఏంటంటే... ఇంత‌వ‌ర‌కు ప‌వ‌న్ పార్టీ ర్యాలీలు త‌ప్ప నిర‌స‌న‌లు చేసింది లేదు. 

ఇక అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ త‌న నియోజ‌క‌వ‌ర్గంపై కూడా మాట్లాడాడు. గ‌తంలో ఇక్క‌డ ప‌ర్య‌టించిన‌పుడు ఇక్కడి నుంచే పోటీ చేస్తాను అని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ త‌ర్వాత ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో పోటీ చేస్తాన‌ని నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు కూడా చెప్పారు. ఇప్ప‌టికి ఆయ‌న 8 నియోజ‌క‌వ‌ర్గాలు పేర్లు చెప్పారు. తాజాగా ఈరోజు మాట్లాడుతూ ఎక్క‌డ పోటీ చేసేదీ ఫిబ్ర‌వ‌రిలో చెబుతాను - నాకు మూడు నెల‌లు టైం ఇవ్వండి అంటున్నాడు. పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గానికి ఇంత స‌మ‌యం ఎందుకు తీసుకుంటున్నాడో ఆయ‌న‌కే తెలియాలి.


Tags:    

Similar News