మ‌హిళా బిల్లు పై.. ప‌వ‌న్ తాజా డిమాండ్‌

Update: 2017-03-08 13:44 GMT
జ‌న‌సేన అధినేత‌ - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవ‌ల ఫుల్ టైం రాజ‌కీయ వేత్త‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన తర్వాత సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై తన వాదనను వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాను చేసే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికి సామాజిక అంశాలతో పాటు ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన ప్రతి అంశంపై తన స్పందనను తెలియజేస్తున్నారు. తాజాగా జనసేనాని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే డిమాండ్‌ ను ప‌వ‌న్ బ‌లంగా వినిపించారు.

మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని  ప‌వ‌న్ విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ ఆస‌క్తికరంగా ఉంది.  "ఎక్కడ మ‌హిళ‌లు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని అన్న పెద్దలు చెప్పేవారు. ప్ర‌స్తుత ఆధునిక కాలంలో వారికి పూజ‌లు చేయక‌పోయిన వారేమీ బాధ‌ప‌డ‌రు. వారు ఎప్పుడు బాధ‌ప‌డ‌తారంటే వారికి క‌నీస గౌర‌వం ఇవ్వ‌న‌పుడు, నిర్భ‌యంగా తిర‌గ‌లేన‌ప్పుడు మ‌న ఆడ‌ప‌డుచులు తీవ్రంగా వ్య‌థ చెందుతారు. ఒక‌ప్పుడు భార‌తీయ స‌మాజంలో స్త్రీకి ఎంతో విలువ ఉండేది. అది క్ర‌మ‌క్ర‌మంగా క్షీణించిపోయింది. ఈ ప్రాభ‌వాన్ని మ‌ళ్లీ మ‌న‌మంద‌రం పున‌రుజ్జీవింప చేద్దాం. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం వస్తుందన్న బాపు మాటలను నిజం చేద్దాం. మ‌హిళా దినోత్స‌వాల‌ను మాట‌ల‌తో చేయ‌డం కాదు. చేత‌ల్లో చూపుదాం. మ‌న ఆడ‌ప‌డుచులు త‌లెత్తుకొని బ‌తికేలా వారికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పిద్దాం. ఎన్నో సంవ‌త్స‌రాలుగా పార్ల‌మెంటును దాటి బ‌య‌ట‌కు రాని మ‌హిళా బిల్లుకు మోక్షం క‌ల్పిద్దాం. భ్రూణ హ‌త్య‌ల‌ను అరిక‌ట్టి ఆడ‌బిడ్డ‌ల‌ను సంర‌క్షించుకున్న‌పుడే భార‌త జాత‌తి సుసంపన్నంగా శోభిల్లుతుంది" అని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News