సినిమాల్లో ఆయన హీరో కావొచ్చు.. సినిమాల్లో రచయితలు రాసిచ్చే పవర్ ఫుల్ డైలాగులతో ఏ సీన్లో అయినా పవన్ కల్యాణ్ దే పై చేయి కావొచ్చు. మాటకు మాట, దెబ్బకు దెబ్బతో సినిమాలో పవన్ కల్యాణ్ సూపర్ స్టార్ అయ్యాడేమో కానీ.. నిజ జీవితంలో మాత్రం పవన్ కల్యాణ్ తీరు తీవ్ర విమర్శల పాలవుతూ ఉంది. ప్రత్యేకించి రాజకీయాల్లోకి వచ్చి పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు కామెడీ గా మారుతూ ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ రాజకీయాల వైపు వచ్చి చాలా సంవత్సరాలు గడిచాయి.
ఇన్నేళ్ల రాజకీయానికి గానూ పవన్ కల్యాణ్ ఏదైనా సాధించాడు అంటే.. అది కేవలం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి పోవడం మాత్రమే. రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయి పవన్ కల్యాణ్... చిత్తు అయ్యాడు. తన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ను కూడా తన మాట వినిపించుకోనట్టుగా తయారు చేసుకున్నాడు జనసేన అధిపతి. ఈ ప్రహసనం లో మరో కామెడీ బీజేపీ తో చేతులు కలపడం.
ఎన్నికలు అయిపోయి ఏడాది అయినా గడవకముందే పవన్ కల్యాణ్ బీజేపీ పంచన చేరాడు. తను ఒక్కడే ఏం సాధించలేనట్టుగా పవన్ కల్యాణ్ అర్థం చేసుకున్నట్టుగా ఉన్నాడు. ఈ క్రమంలో కూడా పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలు మాత్రం మరింత కామెడీ అవుతున్నాయి. అందులో ఒకటి తను ప్రభుత్వాన్ని కూల్చే వరకూ నిద్ర పోయేది ఉండదన్నట్టు గా పవన్ కల్యాణ్ చేసుకున్న ప్రకటన.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేవరకూ తను నిద్రపోనంటూ పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నాడు. అయితే ఇంతకీ ప్రభుత్వాన్ని కూల్చడం అంటే ఏమిటో పవన్ కల్యాణ్ కు తెలుసా? అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. జనసేన అధిపతికి కనీస అవగాహన ఉన్నా ఇలా మాట్లాడడు అని అంటున్నారు.
జగన్ ప్రభుత్వం ఏమీ మైనారిటీలో లేదు. ఏదో బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడలేదు. 151 మంది ఎమ్మెల్యేలతో పటిష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడింది. అలాంటి ప్రభుత్వాన్ని కూలుస్తానంటూ పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలు కామెడీ అవుతున్నాయి. అంత చేసీ పవన్ వెంట ఉన్నది ఒక్క ఎమ్మెల్యే మాత్రమే. ఆయన కూడా ఎన్నాళ్లు జనసేన లో కొనసాగుతారో ఎవరికీ తెలియదు. ఇలాంటి నేపథ్యంలో... పవన్ కల్యాణ్ చేసుకుంటున్న ప్రకటనలు ఆయనను ఒక కమేడియన్ గా నిలబెడుతూ ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సినిమాల్లో హీరోనేమో కానీ రాజకీయాల్లో మాత్రం పవన్ కల్యాణ్ ఒట్టి కమేడియన్ అవుతున్నాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.