బ‌హిరంగ స‌భ‌ల‌కు ప‌వ‌న్ గుడ్ బై!!

Update: 2016-09-10 08:58 GMT
ప్ర‌త్యేక హోదా కోసం పోరు ముమ్మ‌రం చేసిన ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంటారో ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. తిరుప‌తి స‌భ‌లో ప‌వ‌న్ కాకినాడ స‌భ‌తో స్టార్ట్ చేసి ఏపీలోని అన్ని జిల్లాల్లోను ప్ర‌త్యేక హోదా కోసం స‌భ‌లు నిర్వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే కాకినాడ స‌భ‌లో అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదంలో ప‌వ‌న్ అభిమాని వెంక‌ట‌ర‌మ‌ణ మృతిచెందిన సంగ‌తి తెలిసిందే.

 వెంక‌ట‌ర‌మ‌ణ మృతి ప‌వ‌న్‌ ను తీవ్రంగా క‌లిచి వేసింది...ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప‌వ‌న్ కాకినాడ‌లో మీడియాతో మాట్లాడుతూ వెంక‌ట‌ర‌మ‌ణ మృతిపై స్పందించారు. తన వల్ల ఎవరూ నష్టపోవడం ఇష్టం ఉండదని... ఇక‌పై ఉద్య‌మానికి వేరే మార్గం ఆలోచిస్తాన‌ని చెప్పారు. త‌న‌నుంచి కొంద‌రు ఆశిస్తున్న‌ట్టు ఎలాంటి పొర‌పాటు నిర్ణ‌యాలు ఇక‌పై ఉండ‌వ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారట.

  ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే ప‌వ‌న్ ఇక‌పై బ‌హిరంగ స‌భ‌ల‌ను ర‌ద్దు చేసుకునే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. త‌న స‌భ‌ల‌కు అభిమానులు - జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. ఈ స‌భ‌ల్లో వీరు ప్ర‌మాదాల‌కు గుర‌య్యి మృతిచెందుతున్న సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ఇక‌పై బ‌హిరంగ స‌భ‌ల‌కు స్వ‌స్తి ప‌లికి....నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే ప‌ర్య‌ట‌న‌లు చేసేలా ప‌వ‌న్ ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇక‌పై ప‌వ‌న్ హోదాతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు రోడ్ షోలు - ఇత‌ర మార్గాల‌ను ఎంచుకునే ప్లాన్‌ లో ఉన్న‌ట్టు టాక్‌.

 అంత‌కు ముందు ప‌వ‌న్ కాకినాడ‌లోని కిర‌ణ్ కంటి ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. ఆసుప‌త్రిని ప‌రిశీలించిన అనంత‌రం  ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటారు. అనంత‌రం ఆయ‌న పైవిధంగా స్పందించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్ర‌జా ప్ర‌తినిధులు ఫెయిల్ అయితేనే తాను రంగంలోకి దిగుతాన‌ని చెప్పారు. ఏదేమైనా ప్ర‌త్యేక హోదా కోసం ఏపీలో పోరు ఉధృత‌మ‌వుతున్న వేళ‌...జ‌రుగుతున్న ప్ర‌మాదాల దృష్ట్యా ఇక‌పై ప‌వ‌న్ సంయ‌మ‌నంతోనే ముందుకు వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News