ఒక కులమే అధికారాన్ని ఎల్ల వేళలా చేస్తామంటే కుదరదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గర్జించారు. అది రాజ్యాంగానికి కూడా సమ్మతం కాదు అని అంబేద్కర్ సాక్షిగా చెప్పారు. జగన్ 2024లో మరోసారి అధికారాన్ని కోరుతున్నారు. అయితే ఎల్లకాలం ఒక్కరే అంటే ఎలా అని పవన్ అంటున్నారు.
అంతే కాదు ఇంటి పేరులోనే కులాని తగిలించుకున్న వారు క్లాస్ వార్ అని పిలుపు ఇవ్వడమేంటి అని మండిపడ్డారు. అసలు క్లాస్ వార్ అని మాట్లాడడానికి సీఎం కి సిగ్గు ఉండాలని పవన్ పరుషంగా మాట్లాడారు. సీం జగన్ ఇసుక రీచ్ లను మూడు కంపెనీలకు కట్టబెట్టారని తీవ్ర ఆరోపణలను పవన్ చేశారు. మరో వైపు ముప్పయి లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టారు. ఆయనా వర్గ పోరాటం గురించి మాట్లాడేది అని పవన్ ఫైర్ అయ్యారు.
ఎప్పటికీ ఒక కులమే అధికారం వెలగబెట్టరాదు, ఇది ఎవరూ అసలు ఒప్పుకోరు అని కూడా పవన్ చెప్పారు. అంతే కాదు తాను మరో పాతికేళ్ళ పాటు పోరాటం చేస్తాను భీమవరంలోనే ఉంటాను అని పవన్ స్పష్టం చేశారు. ఈ పాతికేళ్ళూ మీకు కూలీగా ఉంటాను అని పవన్ అంటున్నారు. తన నేల భీమవరం అని ఇక్కడే ఉంటాను అని పవన్ ప్రకటించి సంచలనం రేపారు. ఈసారి ప్రజలు తనను గెలిపిస్తారు అనే భావిస్తున్నాను అన్నారు. గత ఎన్నికల్లో ఓడినా తనకు అది ఓటమి అనిపినిచలేదని, ప్రజల అభిమానం నిండుగా తనకు ఉందని పవన్ అంటున్నారు.
గోదావరి జిల్లాలలో తనను తిరగనివ్వను అని వైసీపీ అనుకుంటోందని, కానీ అది వారికి సాధ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. తాను తిరుగుతాను, జనంలోనే ఉంటాను అని ఆయన స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏపీలో ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దామంటూ పవన్ సవాల్ విసిరారు. ఏపీలో రాష్ట్ర పంటగా గంజాయిని రాష్ట్ర ఆయుధంగా గొడ్డలిని మార్చేశారు అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం మీద సెటైర్లు వేశారు.
ఇదిల ఔంటే రాష్ట్రంలో పాత ధరలకే మద్యాన్ని ఇస్తామని అంతే తప్ప సంపూర్ణ మద్య పాన నిషేధం అంటే అది అమలు కాదని పవన్ చెప్పడం విశేషం. ఎవరైనా మహిళలు మద్య పాన నిషేధం అంటే వారి ప్రాంతాలలో మాత్రం నిషేధిస్తామని పవన్ చెప్పడం గమనార్హం టోటల్ గా చూస్తే భీమవరంలో పవన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.
జగన్ మీద మాటల్తో తూటాలు పేల్చారు. అంతే కాదు తాను పోరాటానికే సై అంటూ పెను సవాల్ విసిరారు. ఇక వార్ సవాల్ మీకూ నాకూ అంటూ జగన్ కి డైరెక్ట్ అయిపోయారు. ఈ పొలిటికల్ వార్ ఎంత దూరం వెళ్తుందో చూడాల్సిందే.