దాని కంటే అడుక్కుంటే ఎక్కువ డ‌బ్బులు వ‌స్తాయి

Update: 2019-06-10 07:04 GMT
దారుణ ఓట‌మి త‌ర్వాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు కాస్త ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ల్యాండ్ స్కేప్ విజ‌యం అనంత‌రం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కామ్ అయిపోయారు. అందుకు భిన్నంగా జ‌న‌సేన అధినేత మాత్రం పార్టీ నేత‌ల‌తోనూ.. క్యాడ‌ర్ తోనూ మాట్లాడుతున్నారు. నిత్యం ఏదో ఒక అంశానికి సంబంధించి వార్త‌ల్లో ఉంటున్నారు.

తాజాగా పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓటుకు డ‌బ్బులు తీసుకోవ‌టంపై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓటు అమ్ముకోవ‌టం కంటే అడుక్కోవ‌టం చేస్తే ఎక్కువ డ‌బ్బులు వ‌స్తాయంటూ ఘాటు వ్యాఖ్య చేయ‌టం గ‌మ‌నార్హం. తాను కొంద‌రిని ఓటుకు ఎంతిచ్చార‌ని అడిగాన‌ని.. ఓటుకు రూ.2వేలు అని చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

ఓటుకు రూ.2వేలును ఐదేళ్ల‌కు క‌లిపితే.. రోజుకు రూపాయి వ‌స్తుంద‌ని.. గుడి ద‌గ్గ‌ర భిక్షాట‌న చేసినా అంత‌కంటే ఎక్కువే వ‌స్తాయ‌న్నారు.

గ‌డిచిన ఎన్నిక‌ల్లో అద్భుతాలు జ‌రుగుతాయ‌ని తాను అనుకోలేద‌ని.. ఓట‌మి ఎదురైన‌ప్పుడు ఎవ‌రు నిల‌బ‌డ‌తారో తెలుస్తుంద‌న్నారు. పార్టీలో ఎవ‌రున్నా.. లేకున్నా.. తాను మాత్రం పార్టీని వీడేది లేద‌న్నారు. త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కూ జ‌న‌సేన పార్టీని మోస్తాన‌ని చెప్పారు.

తాను అంద‌రికి అందుబాటులో ఉంటాన‌ని.. ఇక ముందు కూడా బ‌లంగా నిలుస్తాన‌న్నారు. మోడీ నుంచి పిలుపు అందినా తాను వెళ్ల‌క‌పోవ‌టానికి కార‌ణం త‌న‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలుచాలా ముఖ్య‌మ‌న్నారు. తాను ఎవ‌రికి భ‌య‌ప‌డ‌న‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ త‌న ఆశ‌యాల‌ను మాత్ర‌మే చూశార‌ని.. ఇక‌పై త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను చూపిస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఏపీలో జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయ‌లేమో చూస్తాన‌న్నారు.


Tags:    

Similar News