పవన్ చెప్పేశాడు.. హంగ్ వస్తే జగన్ కే..!

Update: 2018-08-16 04:38 GMT
ఏమో గుర్రం ఎగురావచ్చు.. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు.. కింగ్ ను అవుదామని కలలుగంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు తనకు పూర్తి స్థాయిలో అధికారం చెలాయించే సీట్లు రావన్న విషయం తెలుసు. అందుకే ఆయన 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఆయన మద్దతు ఎవరికో చెప్పకనే చెప్పాయి.. పవన్ మాట్లాడుతూ ‘దివంగత ఎన్టీఆర్ అన్ని కష్టాలు అనుభవించి 60 ఏళ్లకు రాజకీయాల్లోకి వచ్చాడు. తెలంగాణలో మంత్రి కేటీఆర్ తెలంగాణ కోసం ఉద్యమించి.. జైలుకు వెళ్లి ప్రజల చేత ఎమ్మెల్యేగా గెలిచి వచ్చాడు. మరి లోకేషన్ సీఎం కావడానికి ఏం అర్హత ఉంది?’ అని ప్రశ్నించారు.

ఈ మాటలను బట్టి పవన్ మనసులో ఒకటే ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. లోకేష్ ఎమ్మెల్సీగా మంత్రి కావడంతో ఆయనకు అర్హత లేదని చెబుతున్నాడు. ఈ రకంగా చూసుకుంటే ప్రజల్లోకి ఒంటరిగా వెళ్లి ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించినప్పుడల్లా పోరుబాట పట్టారు. హోదా - హక్కుల సాధన కోసం ఎంపీలు - ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు.. జనం మద్దతుతో గెలుస్తూ వస్తున్నారు. పవన్ మనోభిష్టం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఒకవేళ హంగ్ ఏర్పడితే వైసీపీ అధినేత జగన్ కే సపోర్టు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

టీడీపీ అన్న.. చంద్రబాబు - లోకేష్ లు అన్న పవన్ కళ్యాణ్ కు అస్సలు పడడం లేదు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే పవన్ కళ్యాణ్ సాధించే సీట్లే కీలకమవుతాయి. ఈ నేపథ్యంలో పవన్ తన మనసులోని మాట బయటపెట్టడం.. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడికే  తన మద్దతు అని ప్రకటించడంతో జగన్ కు లైన్ క్లియర్ అయినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని విభేదాలున్నా కానీ చంద్రబాబు - జగన్ లలో పవన్ మద్దతు జగన్ కేనని తాజా మాటలను బట్టి అర్థమవుతోంది.
Tags:    

Similar News