తను ఏం మాట్లాడుతున్నట్టో కనీసం పవన్ కల్యాణ్ కు అయినా అవగాహన ఉంటుందా? అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఆయన తీరును చూస్తుంటే. జనసేన అధిపతి ట్విటర్ రాజకీయాల్లో తాజా కామెడీ ఎపిసోడ్ ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏదో ఒకటి ట్వీట్ పెట్టాలన్నట్టుగా పవన్ కల్యాణ్ ఒక పాత పుస్తకాన్ని ట్వీట్ చేశారు.
అది ఇప్పటి కాదు.. దాదాపు ఇరవై మూడేళ్ల కిందటిది. అప్పుడు పౌరహక్కుల సంఘం వాళ్లో దాన్ని అచ్చేయించారు. 'కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం' అనేది ఆ పుస్తకం పేరు. పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పింది ఏమిటంటే.. అది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అచ్చు అయినది అని!
'1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో,అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి.రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది.' అంటూ ఆ పుస్తకం గురించి పీకే చెప్పుకొచ్చారు.
అయితే ఇక్కడ వచ్చే ధర్మ సందేహం ఏమిటంటే.. ఎప్పుడో ఇరవై మూడేళ్ల కిందటి పుస్తకాన్ని ఇప్పుడు చదివి స్పందించడం ఏమిటి అని? ఈ ఇరవై మూడేళ్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వెనుకబడిన కులాల, దళితుల జీవితాల్లో కూడా వచ్చిన మార్పులన్నీ గత ఇరవై యేళ్లలో వచ్చినవే! అది కడపలో కావొచ్చు, మరో చోట కావొచ్చు. ప్రస్తుత పరిస్థితులు వేరే, పాతికేళ్ల కిందటి కథలు వేరు.
పవన్ కల్యాణ్ ఈ ప్రాథమిక విషయాన్ని అర్థం చేసుకోనట్టుగా ఉన్నాడు! పవన్ కల్యాణ్ కు నిజంగానే ఆసక్తి ఉంటే, ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లాలి. వారితో గడపాలి. వారి సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి. అంతే కానీ.. ఎవరో రాసిన పుస్తకాలను ఉటంకించడం గొప్ప ఏమీ కాదు. అది కూడా ఇరవై మూడేళ్ల కిందటి పుస్తకాన్ని ఇప్పుడు పట్టుకురావడం పవన్ కల్యాణ్ కు ఉన్న అవగాహన ఏపాటిదో అర్థం అయ్యేలా చేస్తోంది.
అసలు పవన్ కల్యాణ్ ఆ పుస్తకాన్ని ఎందుకు పోస్టు చేసినట్టు అంటే, అందులో జగన్ ప్రస్తావన ఉందట. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. ఇరవై మూడేళ్ల కిందట జగన్ గురించి అందులో రాశారని పవన్ కల్యాణ్ ఆ పుస్తకాన్ని ఇప్పుడు ఉటంకించినట్టుగా ఉన్నాడు. జగన్ పేరు కనిపిస్తే చాలు.. పవన్ కల్యాణ్ దేన్నీ వదలడని, అడ్డగోలుగా మాట్లాడగలడని.. మరోసారి ఇప్పుడు స్పష్టం అవుతోంది!