స‌ర్దార్ థియేట‌ర్లో హ‌త్య‌!

Update: 2016-04-08 14:01 GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా ఎట్ట‌కేల‌కు థియేట‌ర్లోకి వ‌చ్చేసింది. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా క‌ర్ణాట‌కలోని త‌మ‌కూరు జిల్లా పావుగ‌డ ప‌ట్ట‌ణంలో విషాదం చోటు చేసుకుంది. అనంత‌పురం జిల్లా స‌రిహ‌ద్దు ప్రాంతంగా ఉండే పావుగ‌డ అలంకార్ థియేట‌ర్లో స‌ర్దార్ సినిమా చూస్తున్న స‌మ‌యంలో ఇరువురు యువ‌కుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది.

ప‌ట్ట‌ణానికి చెందిన రాకేశ్ నాయ‌క్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా చూసేందుకు ఫ్రెండ్స్ తో క‌లిసి సినిమా చూసేందుకు వ‌చ్చాడు. సినిమా చూసే స‌మ‌యంలో హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను వేరే హీరో వ‌ర్గం వారు కామెంట్ చేయ‌టంతో రాకేశ్ నాయ‌క్ వారితో ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య గొడ‌వ ముదిరింది. దీంతో.. ఇరువ‌ర్గాల వారు క‌త్తుల‌తో దాడి చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో క‌త్తిపోట్ల‌కు గురైన రాకేశ్ నాయ‌క్ తీవ్ర గాయాల‌కు గురై.. అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. థియేట‌ర్లో జ‌రిగిన హ‌త్య స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించ‌టంతో పాటు.. తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.
Tags:    

Similar News