అభిమానులే పవన్ ను తిడుతున్నారు

Update: 2016-02-03 09:44 GMT
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంత అభిమానుల ఆగ్రహాన్ని చవి చూస్తున్నారు. ఇంతవరకు పవన్ అంటే పడిచచ్చే అభిమానులే తెలుసుకానీ పవన్ అంటే మండిపడే అభిమానులు లేరు. పవన్ సినిమా వస్తే భారీ పోస్టర్లు - ఫ్లెక్సీలు కట్టి సందడి చేసే అభిమానులు ఇప్పుడు పవన్ పోస్టర్లను చించేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లెలో వపన అభిమానులే అయన పోస్టర్లను చింపేశారు. ఒకప్పుడు వారు పెట్టిన పోస్లర్లనే వారు చించిపడేశారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న కాపు వివాదంలో పవన్ సరైన స్టేండ్ తీసుకోలేదన్న ఆగ్రహంతో వారీ పనిచేశారు.
   
కాపు ఐక్య గర్జన సభ, ఆ తరువాత హింస నేపథ్యంలో అదే వర్గానికి చెందిన పవర స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అయితే... ఆయన స్పందన గోడమీద పిల్లి వాటంగా ఉంది. దీంతో కాపు అభిమానులు అది జీర్ణంచేసుకోలేకపోయారు. ఆగ్రహంతో మండిపోయి పవన్ పోస్టర్లను చించేశారు.
  
 కేరళలో జరుగుతున్న సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ వదులుకొని మరీ హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన ఆయన నుంచి కాపుఏ అభిమానులు చాలా ఆశించారు. కానీ, పవన్ మాత్రం చంద్రబాబును నొప్పించకుండా తాను కాపులకు ఒక్కరికే ప్రతినిధిని కానని... అందరికీ ప్రతినిధిని అంటూ కాపునేతలకే గడ్డిపెట్టినట్లుగా మాట్లాడడంతో రేపల్లె అభిమానులు హర్టయి ఈ చర్యకు పాల్పడ్డారు. మొత్తానికి అభిమానమే తప్ప ఆగ్రహం తెలియని ఈ సినీ హీరో రాజకీయ నేతగా పరిణామం చెందుతున్న క్రమంలో మున్ముందు ఇంకా చాలా చూడాల్సి ఉంటుంది.
Tags:    

Similar News