బాల‌య్య అండ్ కోకు ప‌వ‌న్ వార్నింగ్‌!

Update: 2018-11-13 05:17 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైర్ అయ్యారు. ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విరుచుకుప‌డుతున్న ఆయ‌న తాజాగా త‌న గురిని మార్చారు. ఆచితూచి అన్న‌ట్లుగా బాబు వియ్యంకుడు బాల‌కృష్ణ‌పై విమ‌ర్శ‌లు సంధించే ఆయ‌న ఈసారి అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల‌న్న హెచ్చ‌రిక చేశారు. ఒక్క బాల‌కృష్ణ‌కే కాదు.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు.. దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ల‌పైనా ఫైర్ అయ్యారు.

ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేద‌న్న ఆయ‌న‌.. తెలుగుదేశం పార్టీ నేత‌లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల‌న్నారు. బాల‌కృష్ణ కూడా యువ‌త‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా తిడుతున్నార‌న్నారు. జ‌న‌సేన‌కు అండ‌గా ఉండే యూత్‌ను ఉద్దేశించి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేద‌న్నారు. సుంక‌ర నాకొడుకుల‌ని బాల‌కృష్ణ మాట తూలుతున్నార‌ని.. ద‌ళితుల్ని కొడ‌తాన‌ని రౌడీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని తిడుతున్నార‌న్న ప‌వ‌న్‌.. ఇలాంటి తీరును మార్చుకోవాల‌న్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు సైతం ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిడుతున్నార‌ని.. మ‌త్య్స కారుల‌ను బూతులు తిడుతున్నార‌న్న ప‌వ‌న్‌.. ఇదేనా మీ సంస్కారం అంటూ ప్ర‌శ్నించారు. ప‌వ‌న్‌ను ఎందుకు న‌మ్మాల‌ని వ్యాఖ్యలు చేస్తున్నార‌ని.. బాబునుఇప్ప‌టివ‌ర‌కూ న‌మ్మార‌ని.. త‌న‌ను ఒక‌సారి న‌మ్మాల‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. తాజాగా ఒక గిరిజ‌నుడికి మంత్రి ప‌ద‌వి ఇచ్చి.. గిరిజ‌నులంతా టీడీపీ ప‌క్షాన ఉన్నార‌ని బాబు భావిస్తున్నార‌ని.. అదంతా త‌ప్పు అన్నారు.

నేత‌లు లేని జ‌న‌సేన ఉందేమో కానీ.. జ‌న‌సైనికులు లేని జ‌న‌సేన‌.. జ‌న‌సేన జెండా లేని గ్రామం లేద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్న ప‌వ‌న్‌.. ఒక కొత్త రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఎన్నిక‌ల్లో నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌న‌ను అభిమానించే వారంతా త‌న‌ను సీఎం.. సీఎం అని అరుస్తుంటే.. ఆ మంత్రం త‌న‌కు బాధ్య‌త గుర్తుకు వ‌స్తుంద‌న్నారు. శ్రీ‌పాద వ‌ల్ల‌భుడు నివ‌సించిన గోదావ‌రి ప్రాంతంలో మీరు ప‌ఠించే మంత్రం త‌ప్ప‌కుండా నిజ‌మ‌వుతుంద‌న్న ప‌వ‌న్‌.. దోపిడీతో నిండిన వ్య‌వ‌స్థ‌ను కూక‌టివేళ్ల‌తో పీకేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

త‌న గుండెల్లో బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల‌కు చోటు లేద‌న్నారు. ప్ర‌ధాని మోడీకి.. కాంగ్రెస్ అధ్య‌క్షులు రాహుల్‌కు వినిపించేలా వారికి ఏపీలో చోటు లేద‌న్న విష‌యాన్ని వినిపంచేలా చెప్పాల‌న్నారు. తాము పాతిక కేజీల బియ్యాన్ని సంపాదించుకుంటామ‌ని.. త‌మ‌కు పాతికేళ్ల భ‌విష్య‌త్తు అవ‌స‌ర‌మ‌ని యువ‌త కోరుకుంటుంద‌న్నారు. ఏపీలో ఉన్న‌వి రెండే కులాల‌ని.. ఒక‌టి దోపిడీ చేసే కుల‌మ‌ని.. మ‌రొక‌టి దోపిడీకి గుర‌య్యే కుల‌మ‌న్నారు. రాష్ట్రంలో దోపిడీ చేసే కులాన్ని కూల‌దోయాల్సిందేన‌న్న ప‌వ‌న్‌.. తాను ఆ ప‌ని చేస్తాన‌న్నారు.
Tags:    

Similar News