జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో ఎన్నో పార్శ్యాలు - ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయనేందుకు తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూనే నిదర్శనం. ఒక్కటే సంభాషణ అయినప్పటికీ పవన్ ఎన్నో విషయాలను వెల్లడించారు. అయితే రాజకీయాల పరంగా ఆయన చేసిన స్టేట్ మెంట్ లు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అధికార - ప్రతిపక్ష పార్టీలను ఏకకాలంలో పవన్ మద్దతివ్వడమే కాకుండా ఇరుకున కూడా పెట్టేశారు!
రాజకీయ చేరికల గురించి పవన్ మాట్లాడుతూ పార్టీలు మారాలంటే బలమైన కారణాలుండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా ఒక పార్టీ తరఫున గెలిచిన వారు మరో పార్టీ మారడం సరికాదని పవన్ చెప్పారు. ఈ ప్రకటన ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి - తెలంగాణలో అధికారపక్షమైన టీఆర్ ఎస్ కు అస్త్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఏకకాలంలో టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఇరుకున పెట్టినట్లు అవుతుందని చెప్తున్నారు.
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమయి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గులాబీ గూటికి చేరినపుడు పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకపార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడం సరికాదని ఫైర్ అయ్యారు. అయితే ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పుకున్నపుడు మాత్రం పవన్ స్పందించలేదు. దీంతో అంతా పవన్ చిత్తశుద్ధిని శంకించారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే జంపింగ్ లపై తనవైఖరి ఏంటో ఇపుడు పవన్ స్పష్టం చేశారు. ఈ స్టేట్ మెంట్ వైసీపీ - టీఆర్ ఎస్ లకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు గోడ దూకడంపై ప్రశ్నిస్తున్న వైసీపీ 'మిమ్మల్ని గెలిపించిన పవన్ కళ్యాణ్ కూడా తప్పుపడుతున్నా ఎమ్మెల్యేలను చేర్చుకుంటారా చంద్రబాబు?' అంటూ ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. మరోవైపు టీఆర్ ఎస్ సైతం 'తమ ఫిరాయింపులను ప్రశ్నించే ముందు ఏపీలో ఏం జరుగుతుందో చూసుకోవాలి 'అంటూ దెప్పిపొడిచే చాన్స్ కూడా ఉంది. మొత్తంగా పవన్ ఏకకాలంలో ఇటు టీఆర్ ఎస్ కు, అటు వైసీపీకి అస్త్రం ఇచ్చినట్లయిందని రాజకీయవర్గాలు అంటున్నాయి.