జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్ది కాలంగా కంటి సమస్య ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కొన్ని రోజుల పాటు నల్ల కళ్లద్దాల్ని వాడారు. తాను కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన తన కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
పది రోజుల క్రితం ఎల్వీ ప్రసాద్ వైద్యుల్ని పవన్ సంప్రదించారు. వారు పవన్ కంటిని పరీక్షించారు. ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించారు. శస్త్రచికిత్సతోనే కురుపును తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో.. బుధవారం ఆయనకు శస్త్ర చికిత్స చేపట్టారు.
శస్త్ర చికిత్స కోసం పవన్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు చేపట్టిన సర్జరీ సక్సెస్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు. శస్త్ర చికిత్స జరిగిన తర్వాత పవన్ ను డిశ్చార్జ్ చేశారు. నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు పవన్ కు సూచించినట్లు చెబుతున్నారు.
ఈ నెల 16 నుంచి తూర్పుగోదావరిలో ప్రజాపోరాట యాత్రలో పవన్ పాల్గొనాల్సి ఉంది. తాజా శస్త్రచికిత్స .. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలన్న సూచన చేసిన నేపథ్యంలో యాత్ర జరుగుతుందా? వాయిదా పడుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. యాత్రపై ఈ రోజున (శుక్రవారం) ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.
తన కంటికున్న సమస్య గురించి తొలిసారిగా పవన్ రంగస్థలం సక్సెస్ మీట్ లో వెల్లడించారు. కంటికి సమస్య ఉందన్నారే కానీ.. సమస్య ఏమిటన్నది చెప్పలేదు. ఆ ఫంక్షన్ కు నల్ల కళ్లద్దాలు పెట్టుకొచ్చిన పవన్.. తనకున్న సమస్యతోనే తానుఅలా వచ్చినట్లుగా పేర్కొన్నారు. కంటికి సంబంధించిన సమస్యకు సర్జరీ అవసరమని అప్పట్లోనే వైద్యులు చెప్పినా.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు గురువారం ఆయనకు ఆపరేషన్ ను నిర్వహించారు. ఆపరేషన్ సక్సెస్ కావటంతో పవన్‌కుటుంబ సభ్యులు.. మిత్రులు.. అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.