పవన్ ను ఆట ఆడుకున్న లేడీ ఫ్యాన్స్

Update: 2018-12-01 10:48 GMT
జనసేనాని పవన్ కళ్యాన్ తనలోని కామెడీ టైమింగ్ ను మరోసారి బయటకు తీశారు. తను అంటే ఊగిపోతున్న లేడీ ఫ్యాన్స్ ను డైలాగులతో ఊపేశాడు. డైలాగులు పేల్చి వారిని అలరించడమే కాదు.. సభలో నవ్వులు పూయించాడు.

 సినిమాలు మాని రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ స్టామినా ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా అమ్మాయిలు పవన్ అంటే పడి చస్తున్నారు. తాజాగా జనసేన పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా అమ్మాయిలు రచ్చ చేశారు. పవన్ ధరించే ఎర్ర టవల్స్ పట్టుకొని ఊపుతూ పవన్ .. పవన్ అంటూ ఆయనలా అనుకరిస్తూ రెచ్చిపోయారు.

లోకేష్ ఏపీలో సైకిల్ యాత్ర చేస్తూ ఇసుక దోపిడీ కలెక్షన్లు తీసుకుంటున్నాడని పవన్ సీరియస్ కామెంట్స్ చేస్తుండగా.. పవన్ పక్కనే బిల్డింగ్ లపై ఉన్న అమ్మాయిలు పదే పదే పవన్ ను డిస్ట్రబ్ చేస్తూ కేకలు వేశారు. ఈ దెబ్బకు పవన్ కూడా వారిని సరదాగా ఆటపట్టించాడు. ‘అమ్మాయిలు కూడా ఇంత రౌడీల్లా తయారైతే ఎలా చెప్పండి.. అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్ అంటారని.. మరి అమ్మాయిలు చేస్తే ఆడమ్ టీజింగ్ అనాలా మనం.. అమ్మాయిలు మీమీద ఆడమ్ టీజింగ్ కేసులు పెట్టిస్తా..  ’ అంటూ సరదాగా కామెంట్ చేశారు..

అయినా ఆగని అమ్మాయిలు పవన్ పవన్ అంటూ కేకలు వేస్తూనే ఉన్నారు.. దీంతో సభలో అమ్మాయిల గోల ఎక్కువవడం చూసి మరోసారి అమ్మాయిలపై పవన్ కామెంట్ చేశారు.. ‘అమ్మాయిలు నా సభలో ఇంత అల్లరి చేస్తున్నారంటే ఏం చేయాలి చెప్పండి.. అబ్బాయిలు అల్లరి చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆడపడుచులు మీరు కూడా నన్ను ఏడిపిస్తే ఎలా చెప్పండి’ అంటూ పవన్ సరదాగా వ్యాఖ్యానించారు. మీ ప్రేమ నాకు అర్థమైందని చివరకు ముగించాడు..

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News