ఈ అవార్డు తీసుకొని ప‌వ‌న్ ఇరుకున‌ప‌డ్డాడా?

Update: 2017-11-20 06:58 GMT
ఔను జ‌న‌సేన అధినేత - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి సాగుతున్న ప్ర‌చారం ఇది. లండన్‌ లో పవన్‌ కళ్యాణ్‌ శుక్ర - శనివారాల్లో బిజీబిజీగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని వెస్ట్‌ మినిస్టర్‌ రోడ్‌ లోని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో నిర్వహించిన ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ లో ఐఈబీఎఫ్‌ గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకోవ‌డం, ఆ త‌ర్వాత ఆయ‌న‌కు హైద‌రాబాద్‌ లో ఘ‌న స్వాగ‌తం ల‌భించ‌డం వంటివ‌న్నీ ఆయ‌న అభిమానుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తిని క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అవార్డుపై అప్పుడే విమ‌ర్శ‌లు ముసురుతున్నాయి. అవార్డు అందించిన‌ ఇండో బిజినెస్ ఫోరం కార‌ణంగానే ఈ ఆరోప‌ణ‌లు రావ‌డం గ‌మ‌నార్హం.

ఐఈబీఎఫ్ అవార్డులు కేవ‌లం వ్యాపార‌రంగానికే కాకుండా - స్పొర్ట్స్  - సొషల్ అండ్ కమ్యునిటీ సర్విస్ - పబ్లిక్ హెల్త్ - ఏడ్యుకెషన్ - స్కిల్ అండ్ డెవలప్మెంట్ అనే విభాగాలలొ ఇస్తారు అని ఆ సంస్థ వెబ్‌ సైట్ లోనే ఉంది. కాగా, ఈ సంస్థ అవార్డు తెలుగువారికి రావ‌డం ఇదే మొద‌టి సారి కాదు. 2015 లోఈ అవార్డు ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుకు వచ్చింది. బ్రిటీష్ మ్యుజియం నుండి అమరావతి సంభందించిన బౌద్ద శేషాలను - కళాకండాలను వెనుకకి తెప్పించే ప్రయత్నం చేసి సఫలీకృతం అయినందుకు ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. అయిన‌ప్ప‌టికీ..ప‌వ‌న్ ఫ్యాన్స్ కొంద‌రు మొట్ట‌మొద‌టిసారిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కే అవార్డు ద‌క్కింద‌ని ప్ర‌చారం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని ప‌లువురు అంటున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్‌ కు ఏ కేట‌గిరిలో ఈ అవార్డును అందించార‌నేది స్ప‌ష్టత లేదు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే ఐఈబీఎఫ్ అవార్డు ఇచ్చే సంస్థ ర‌థ‌సార‌థి విజ‌య్‌ గోయ‌ల్ నేప‌థ్యం ఈ అవార్డు గురించి సాగుతున్న ప్ర‌చారంలోని విశ్వ‌స‌నీయ‌త‌ను ప‌లుచ‌న చేస్తోంద‌ని అంటున్నారు. విజ‌య్ గోయ‌ల్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్ర‌కారం ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌న్నిహితుల్లో ఒక‌రు. స్ప‌ష్టంగా చెప్పాలంటే...లండ‌న్‌ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ రిప్ర‌జెంటేటివ్‌. దీంతో స‌హజంగానే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. మ‌రోవైపు ఈ అవార్డుల్లో భాగ‌స్వామిగా ఉన్న సార్క్ సంస్థ‌కు చెందిన వారిలో ఒక‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసి కావ‌డంతో ఈ డౌట్లు వ‌స్తున్నాయి. స్థూలంగా ఏపీకి చెందిన వ్య‌క్తితో సంబంధాలున్న సంస్థ‌ - ఏపీ స‌ర్కారు ప్ర‌తినిధిగా ఉన్న వ్య‌క్తికి చెందిన వేదిక నుంచి అవార్డు తీసుకొని దాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డం ఏంట‌నేది అర్థం కావ‌డం లేద‌ని ప‌లువురు విమ‌ర్శ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News