ప‌వ‌న్ దుబ్బాక ప్ర‌చారానికి దూరంగా వుండాల్సిందేనా?

Update: 2020-10-22 17:31 GMT
దుబ్బాక‌లో బై పోల్ జ‌ర‌గ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ బ‌రిలోకి దిగ‌డం లేద‌ని తెలుస్తోంది. మీడియాలో మాత్రం బీజేపీ త‌రుపున జ‌న‌సేనాని ప్ర‌చారానికి దిగుతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అందుకు విరుద్ధంగా ప‌వ‌న్ ప్ర‌చారానికి వెళ్ల‌డం లేద‌ని తెలుస్తోంది.

దుబ్బాక‌లో యువ ఓట‌ర్ల‌ని ఆక‌ర్షించే విధింగా ఉప ఎన్నిక‌ల‌లో పార్టీ కోసం ప్ర‌చారం చేయాల‌ని బీజేపీ నాయ‌కులు ప‌వ‌న్‌ ని ఇటీవ‌ల అభ్య‌ర్థించార‌ట‌. అయితే అది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది జ‌న‌సేన పార్టీ వ‌ర్గాల నుంచి ఎలాంటి అధికారిక వివ‌ర‌ణ రాలేదు. అయితే బీజేపీ వ‌ర్గాలు మాత్రం ప‌వ‌న్‌ ని సంప్ర‌దించ‌కుండానే మీడియాకు లీకులు వ‌దులుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప‌వ‌న్ మాత్రం తెలంగాణ‌లో వున్న తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెరాస‌కు వ్య‌తిరేకంగా బీజేపీకి అనుకూలంగా త‌ను దుబ్బాక‌లో ప్ర‌చారం చేసేది లేద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు చెబుతున్నారు. దీంతో తెరాస వ‌ర్గాలు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నాయ‌ట‌. ఇటీవ‌ల హైద‌రాబాద్ ‌లో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌గ‌రంలోని చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా తెలంగాణ సీఎం స‌హ‌య నిధికి కోటి విరాళం అందించిన జ‌న‌సేనాని వ‌ర‌ద బాదితులను ర‌క్షించ‌డానికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్ర‌త్యేకంగా అభినందించారు ప‌వ‌న్‌. ఈ త‌రుణంలో తెరాస‌ని ఎన్నిక‌ల కోసం విమ‌ర్శించ‌డానికి ప‌వ‌న్ ఇష్ట‌ప‌డ‌టం లేద‌ట‌.

రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ ఏపీలో మాత్ర‌మే జ‌న‌సేన పోటీ ప‌డుతుంద‌ని,... తెలంగాణ‌లో పోటీకి దింప‌డానికి ప‌వ‌న్ ఆస‌క్తిని చూపించ‌డం లేద‌న‌పి, బీజేపీతో పొత్తు అనేది ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం అని దాన్ని తెలంగాణ విష‌యంలోనూ ప‌వ‌న్ చూడాల‌నుకోవ‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News