నేడు పవన్ నూతన గృహ ప్రవేశం!
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటోన్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పవన్ ఆంధ్ర ప్రదేశ్ కు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని పడమటలో అద్దె ఇల్లు తీసుకున్న పవన్ విజయవాడ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు జరుపుతున్నారు. ఇంట్లోనే పార్టీ సమావేశాలు - మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. మరో వైపు పవన్ నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో సొంత ఇంటిని - కార్యాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పవన్ ....హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో తన కొత్త ఇంటి గృహ ప్రవేశం చేయబోతున్నారు.
జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ దేవాలయం సమీపంలో పవన్..ఓ సొంత ఇంటిని నిర్మించుకున్నారు. వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఆ ఇంటికి దీపావళి సందర్భంగా పవన్ `గృహ ప్రవేశం` కార్యక్రమం నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. కొత్త ఇంటిని తన శాశ్వత నివాసంగా చేసుకోవాలని పవన్ భావిస్తున్నారట. మరో వైపు నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో సొంత ఇంటిని - కార్యాలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలోనే ఆ కార్యాలయం ప్రారంభించాలని పవన్ ప్లాన్ చేస్తున్నారట. అక్కడి పనులు ఆలస్యంమవుతుండటంతో విజయవాడలోని పడమటలో ఓ మూడంతస్తుల ఇంటిని పవన్ అద్దెకు తీసకున్న సంగతి తెలిసిందే. ఆ ఇంటి నుంచే పవన్....తన పార్టీ కార్యకలాపాలు కూడా నడుపుతున్నారు.