ట్విట్టర్లో పవన్ కొత్త కూత

Update: 2017-05-27 10:23 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ఇన్ యాక్టివ్ అయి దాదాపు మూడు వారాలవుతోంది. మే 8 నుంచి ఆ అకౌంట్ నుంచి ఒక్క ట్వీటూ లేదు. పవన్ ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసినట్లుగా ప్రకటించాయి జనసేన వర్గాలు. ఐతే ఇన్ని రోజులవుతున్నా హ్యాకింగ్ గుట్టు కనిపెట్టకపోవడం.. పవన్ ట్విట్టర్ ఖాతాను రిట్రీవ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పవన్ దగ్గరుండే టెక్నికల్ టీం ఎంతగా ప్రయత్నిస్తున్నా పని కావట్లేదని అంటున్నారు. దీంతో ఇక పవన్ పేరుతో కొత్త ఖాతాను మొదలుపెట్టడం మేలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం మంచి ముహూర్తం చూస్తున్నారు. ఓవైపు పాత ఖాతాను పునరుద్ధరించడం మీద దృష్టిపెడుతూనే.. కొత్త ఖాతా తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంచి సందర్భం చూసి కొత్త ఖాతా మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

పవన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కాలేదని.. దాన్ని మెయింటైన్ చేసే వ్యక్తిని ఉన్నట్లుండి తొలగించడంతో అతను దాన్ని లాక్ చేసి పోయాడని అంటూ ఓ వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తన అకౌంట్ లాక్ అయ్యే ముందు పవన్ ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక అంశం మీద స్పందించడం.. ఏదో ఒక కామెంట్ చేయడం.. జనసేన అధికారిక ప్రకటనల్ని ఈ అకౌంట్ ద్వారానే మీడియాకు రిలీజ్ చేయడం జరుగుతుండేది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News