జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విశాఖ భూముల కుంభకోణంపై ఆయన ఇప్పటివరకూ స్పందించకపోవడమే ఇందుకు కారణం. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా ఆ కుంభకోణంపై పవన్ ఎటువంటి వ్యాఖ్య చేయకపోవడం గమనార్హం.
గతంలో ప్రత్యేక హోదా అంశం, అమరావతిలో భూ సేకరణ - మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ ఇపుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవో గా నియమించడం పై చంద్రబాబును విమర్శించిన పవన్ - లక్ష ఎకరాల భూ కుంభకోణంపై నోరు మెదకపోవడం ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ భూ కుంభకోణంపై ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ అంశంపై తెలుగుదేశం మిత్రపక్షం బీజేపీ కూడా ఘాటుగా స్పందిస్తోంది. కాంగ్రెస్ అయితే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ అంశంపై ఇతర రాజకీయ పార్టీలు కూడా రచ్చ చేస్తున్నాయి. అటువంటిది పవన్ కల్యాణ్ ఈ అంశం గురించి ఏమీ పట్టనట్టు వ్యవహరించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఒక వేళ షూటింగ్ పనుల్లో పవన్ బిజీగా ఉన్నారని భావించే కూడా అవకాశం లేదు. పవన్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వర్తమాన అంశాలపై - ప్రజా సమస్యలపై ట్విట్టర్ లో తప్పక స్పందిస్తారు. కానీ - విశాఖ భూ కుంభకోణంపై పవన్ కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా ఈ అంశంపై పవన్ స్పందించకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని రాజకీయ విశ్లేషకు భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/