ఆర్కే తిట్ల‌ను భ‌రిస్తాం...ఏం చేయ‌గ‌లం: ప‌వ‌న్

Update: 2018-04-22 16:07 GMT
త‌న‌ను - త‌న త‌ల్లిని ప‌నిగ‌ట్టుకొని కొన్ని మీడియా చానెళ్లు - వాటి అధిప‌తులు అవ‌మానించార‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వార్ మొద‌లెట్టిన సంగతి తెలిసిందే. త‌న‌ను కొద్ది నెల‌లుగా ఇబ్బంది పెట్టిన మీడియా చానెళ్ల‌ను వ‌దిలిపెట్ట‌న‌ని - కొన్ని మీడియా చానెళ్ల‌కు వ్య‌తిరేకంగా తాను సుదీర్ఘ న్యాయ‌పోరాటం చేయ‌బోతున్నాన‌ని ప‌వ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు - టీవీ5 - టీవీ9 - ఏబీఎన్ చానెళ్ల‌ను బాయ్ కాట్ చేయాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పిలుపునిచ్చారు. ప‌వ‌న్ అన్న మాట ప్ర‌కార‌మే.....మొద‌ట‌గా శ్రీ‌నిరాజు ఆ త‌ర్వాత టీవీ9 ర‌వి ప్ర‌కాశ్...తాజాగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై వ‌రుస ట్వీట్ల‌తో విరుచుకుప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ఉద‌యం నుంచి ఆర్కేపై ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్లు పెడుతున్నారు.  ``ఆర్కే.. ప్లీజ్ వెల్ కమ్ టూ బట్టలూడదీసి మాట్లాడుకుందాం.. బట్టలూడదూసి కొడదాం..... బీఎంబీకే ప్రోగ్రాం`` అంటూ పవన్ తీవ్ర‌స్థాయిలో ట్వీట్ చేశా. ఆ త‌ర్వాత ``ఆంధ్రజ్యోతి నడుపుతున్నావా.. టీడీపీ జ్యోతి నడుపుతున్నావా? నీ పేపర్ ఆంధ్రులకు సంబంధించింది అయితే కాదని.. అందుకు కొద్దివారాల్లో ఒక స్పష్టత వస్తుందని`` మ‌రో షాకింగ్ ట్వీట్ చేశారు. అయితే, తాజాగా ప‌వ‌న్....ఆర్కేను బ‌ల‌వంతుడిగా పేర్కొంటూ మ‌రో సంచ‌ల‌న ట్వీట్ చేశారు. తాము శ‌క్తి హీనుల‌మ‌ని - త‌మ‌కు అధికారం లేద‌ని, కాబ‌ట్టి తిట్ల‌ను భ‌రిస్తామని ప‌వన్ చేసిన ట్వీట్ వైర‌ల్ అయింది.

ఈ రోజు ఉద‌యం నుంచి ఆర్కే పై ప‌వ‌న్ విరుచుకుప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఆర్కేను శ‌క్తిమంతుడిగా పేర్కొంటూ ప‌వ‌న్ చేసిన ట్వీట్ ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ``ఆర్కే...మీ తిట్ల‌ను మేం భ‌రిస్తాం. ఏం చేయ‌మంటారు? మేము సాత్వికులం - శ‌క్తి హీనులం. మేం ఇబ్బంది ప‌డ‌తాం`` అంటూ న‌వ్వుతూ...న‌మ‌స్కారం పెట్టిన ఎమోజీని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కింద ప‌వ‌న్ ఫ్యాన్స్ పై బంజారా హిల్స్ పోలీసు స్టేష‌న్ లో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి త‌ర‌ఫున న‌మోదైన కేసు ఎఫ్ ఐఆర్ నంబ‌రును ప‌వ‌న్ పోస్ట్ చేశారు. ఆ వెంట‌నే ప‌వ‌న్ మ‌రో ట్వీట్ చేశారు. ``టీడీపీ జ్యోతి ర‌త్న ఆర్కే...టీడీపీ సంస్కృతి ఏమిటి? ప‌్ర‌ధాని మొద‌లుకొని సామాన్యుడి వ‌ర‌కు అంద‌రినీ తిట్ట‌డ‌మా? చాలా మంచి శిక్ష‌ణ‌. అలాగే కొన‌సాగించండి. ప్ర‌త్యేక హాదాను సాధించ‌డానికి టీడీపీ నాయ‌కుల‌ ద‌గ్గ‌ర గొప్ప వ్యూహం ఉంది. అత్యంత అస‌భ్య‌ప‌ద‌జాలంతో ప్ర‌ధానిని దూషించ‌డమే ఆ వ్యూహం. ఇది త‌ప్ప‌కుండా ఆర్కే స‌ల‌హానే.`` అంటూ మ‌రో ట్వీట్ చేశారు.

వాస్త‌వానికి కొన్ని మీడియా చానెళ్ల‌పై ప‌వ‌న్ సుదీర్ఘ న్యాయ‌పోరాటం చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం, అందుకు త‌గ్గ‌ట్లుగానే శ్రీ‌నిరాజు - ర‌విప్ర‌కాశ్ - ఆర్కే ల‌పై ట్విట్ట‌ర్ లో విరుచుకుప‌డ‌డంతో అంతా ప‌వ‌న్ ట్వీట్ల‌ను చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు. తాను ప్ర‌స్తావించిన ముగ్గురికి సంబంధించి ప‌వ‌న్ ద‌గ్గ‌ర ఏద‌న్నా ప్ర‌త్యేక స‌మాచారం ఉంద‌ని,...దానిని ప‌వ‌న్ విడ‌త‌ల‌వారీగా లీక్ చేసి వారిని ఎండ‌గ‌డ‌తార‌ని భావించారు. అయితే, అందుకు భిన్నంగా ప‌వ‌న్ ర‌వి ప్రకాశ్ కు గ‌తంలో అవ‌మానం జ‌రిగిన పాత వీడియోను ఫ్రెష్ అప్ డేట్ అంటూ పోస్ట్ చేయ‌డం..దానిపై వ‌ర్మ వంటి వారు సెటైర్లు వేయ‌డంతో ప‌వ‌న్ ట్వీట్ల‌తో సీరియ‌స్ నెస్ పై చ‌ర్చ మొద‌లైంది. తాజాగా, ఆర్కే గురించి ఉద‌యం సీరియ‌స్ గా...``బట్టలూడదీసి మాట్లాడుకుందాం.. బట్టలూడదూసి కొడదాం..... బీఎంబీకే ప్రోగ్రాం`` అంటూ ట్వీట్ చేయ‌డంతో ...ఆ త‌ర్వాత కూడా ఆర్కేపై మ‌రిన్ని అప్ డేట్స్ వ‌స్తాయ‌ని ప‌వ‌న్ ట్వీట్ చేయ‌డంతో అంద‌రిలో ఆస‌క్తి రేగింది. అయితే, ప‌వ‌న్ అనూహ్యంగా ఆర్కేను బ‌ల‌వంతుణ్ణి చేస్తూ....తాము బ‌ల‌హీనుల‌ని బాహాటంగా అంగీక‌రిస్తూ ట్వీట్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఉద‌యం ఆర్కేను దూషిస్తున్న‌ట్టుగా ట్వీట్ చేసిన ప‌వ‌న్....సాయంత్రానికి....ఆర్కే త‌మ‌ను దూషించినా భ‌రిస్తామ‌ని లొంగిపోయిన‌ట్లుగా ట్వీట్ చేయ‌డం హాస్యాస్పదంగా ఉంద‌ని చెప్ప‌వ‌ర్చు. తాజాగా ప‌వ‌న్ ట్వీట్లు ప‌వ‌న్ వ్య‌తిరేకుల‌తోపాటు సామాన్యుల‌కు, ఆయ‌న అభిమానుల‌కు కూడా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించి ఉంటాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదని చెప్ప‌వ‌చ్చు. ట్విట్ట‌ర్ వార్ మొద‌లు పెట్టి రెండు రోజులైనా కాక‌ముందే....ఇలా పూట‌కో మాట మారుస్తున్న ప‌వ‌న్....తాను చేయ‌బోతోన్న‌ సుదీర్ఘ న్యాయ‌ పోరాటంలో ఎంత వ‌ర‌కు ముందుకు వెళ‌తాడ‌న్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌!


Tags:    

Similar News