పవన్ కళ్యాణ్ సినిమాలలో ఉన్నన్ని రోజులు ఏ సమస్య లేదు కానీ , రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి లేని పోనీ సమస్యలతో సతమతమౌతున్నారు. పోనీ పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజలతో ఉన్నారా అంటే అదికూడా లేదు. ఆయనకి స్పందించాలి అనుకున్నప్పుడు ఎక్కడినుండి వస్తాడో వస్తాడు ఏవో నాలుగు మాటలు చెప్తాడు మళ్ళీ కొన్ని రోజుల వరకు ఎవరికీ కనిపించకుండా ఎక్కడో ఒక మూలన కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. ఇది ఇప్పటికే ఎన్నో సందర్భాలలో రుజువైంది. పవన్ స్పందించాల్సిన విషయాలు ఎన్నో ఉంటె ఎదో స్పందించాలి కదా అని అర్థం పర్థం లేని సమస్యలపై మాట్లాడుతుంటారు.
ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కొన్ని విమర్శలు చేసారు. దానిపై రాజకీయంగానే పవన్ స్పందించి ఉంటే బాగుండేది కానీ - పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ..మీ ఇంటి పెళ్లికొచ్చా - మీతో నాకు పర్సనల్ రిలేషన్ షిప్ ఉంది. ఆ అనుబంధం అలాగే కొనసాగనీయండి - మధ్యలో లేనిపోని విమర్శలు చేయకండి. పద్ధతిగా మాట్లాడండి అంటూ పవన్ మాట్లాడారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అంటూ అంబటి విమర్శలు చేయడంతో పవన్ ఈ విధంగా స్పందించారు.
అంబటి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలనుకుంటే తాను దత్తపుత్రుడిని ఎందుకు కాదో పవన్ చెప్పుకోవాలి - చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే చెప్పుకోవాలి కానీ - నాకు నీకు రిలేషన్ ఉంది .. మీ ఇంటి పెళ్లికొచ్చా అంటే సినిమాలలో లాగా సెంటిమెంట్ తో కొట్టాలని చూస్తున్నట్టు అర్థమౌతుంది. అంబటి ఇంట్లో జరిగిన పెళ్లికి పవన్ కల్యాణ్ వెళ్లి ఉండొచ్చు. అన్నీ తానై చేసి ఉండొచ్చు కూడా. అంత మాత్రాన వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేయకూడదంటే అంటే రాజకీయాలలో ఎలా కుదురుతుంది. పవన్ కల్యాణ్ ఇసుక ఇబ్బందుల గురించి మాట్లాడితే తప్పులేదు - వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు - జగన్ పై జరిగిన కోడికత్తి కేసు పోలీసు విచారణలో ఉండగా.. దాన్ని కూడా జగన్ కి సంబంధం పెడుతూ మాట్లాడితే చంద్రబాబు దత్త పుత్రుడు అని అనక ఇంకేం అంటారు. ఒకవేళ ఇప్పుడు నేను కూడా పవన్ మూడు పెళ్లిళ్లకూ వెళ్లానని కాబట్టి నన్ను పవన్ విమర్శించకూడదు అంటే పవన్ సైలెంట్ గా ఉంటాడా ... దానికి పవన్ దగ్గర సమాధానం ఉంటుందా..