జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ తర్వాత అంతో ఇంతో చెప్పుకోదగ్గ నేత ఎవరైనా ఉన్నారంటే అది నాదెండ్ల మనోహర్ మాత్రమే. మనోహర్ చెబితే పవన్ వింటారు. రాజకీయంగా పవన్ కు అన్ని విధాలుగా అండగా ఉన్న నాదెండ్లను గుంటూరు నియోజకవర్గంలో నిలబెట్టాలని జనసేనాని భావించారు. కానీ నాదెండ్ల డిమాండ్ తో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
అవును.. తెనాలి నుంచి పోటీ చేయాలనే పంతాన్ని నాదెండ్ల నెగ్గించుకున్నారు. తెనాలిలో నాదెండ్లకు మంచి సర్కిల్ ఉంది. అక్కడ్నుంచి పోటీచేస్తే గెలుస్తాననే నమ్మకం కూడా ఉంది. నాదెండ్ల చెప్పిన వివరాలు విన్న మీదట పవన్ కూడా అందుకు అంగీకరించాల్సి వచ్చింది.
ఒక దశలో నాదెండ్లను ఎంపీ అభ్యర్థిగా కూడా నిలబెట్టాలని పవన్ భావించారు. ఢిల్లీ స్థాయిలో జనసేన గొంతు వినిపించడానికి నాదెండ్ల లాంటి చదవుకున్న వ్యక్తి అయితే బాగుంటుందని పవన్ భావించారు. కానీ నాదెండ్ల మాత్రం తెనాలిపైనే ఫోకస్ పెట్టడంతో - పవన్ వెనక్కి తగ్గక తప్పలేదు